పాకిస్తాన్ లో పూజలందుకుంటున్న 1500 ఏళ్ల పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ విశిష్టత ఇదే..!

భారత దేశంలో ఒకప్పుడు ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేవాలయాలు ఉండేవి.ఈ దేవాలయాలు మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ప్రతిబింబించేవి.

 This Is The Uniqueness Of The 1500 Year Old Panchamukha Anjaneya Swamy Temple Which Is Worshiped In Pakistan-TeluguStop.com

కాలక్రమేణా మన భారతదేశం ముక్కలుగా ఏర్పడటం వల్ల కొన్ని హిందూ దేవాలయాలు పాకిస్తాన్ లోకి వెళ్లిపోయాయి.అలాంటి పుణ్యక్షేత్రాలలో ఎంతో ప్రసిద్ధి చెందినదే పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం.

ఇప్పటికీ ఆ దేశంలో ఈ ఆలయానికి ఎంతో ఆదరణ ఉంది.పాకిస్తాన్ కరాచీలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ విశిష్టత గురించి ఇక్కడ తెలుసుకుందాం.

 This Is The Uniqueness Of The 1500 Year Old Panchamukha Anjaneya Swamy Temple Which Is Worshiped In Pakistan-పాకిస్తాన్ లో పూజలందుకుంటున్న 1500 ఏళ్ల పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ విశిష్టత ఇదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Pak Hindu Association, Pakistan, Panchamuka Anjaneya, Uniqueness 1500-Telugu Bhakthi

పాక్ హిందూ సంఘం పాకిస్తాన్ లో అనేక హిందూ దేవాలయాలను పరిరక్షిస్తుంది.అందులో ఒకటిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినది కరాచీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం.మహానట బలదేవ్ దాస్ గడీ నశీన్ ఆధ్వర్యం లో ఈ దేవాలయం 1927 లో ఆలయ నిర్మాణం జరిగింది.శ్రీరాముడు కల్యాణం అనంతరం వనవాసం చేసినప్పుడు సాక్షాత్తు ఆ సీతాదేవితో కలిసి ఈ ప్రాంతంలోనే విడిది చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

పురావస్తు శాఖ అధ్యయనం ప్రకారం ఈ ఆలయం దాదాపు 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడినదిగా తెలియజేశారు.

ఈ ఆలయంలో ఎనిమిది అడుగుల ఎత్తు ఆంజనేయ స్వామి విగ్రహం కలిగి హనుమంతుడు, నరసింహుడు, హయగ్రీవుడు, ఆది వరాహుడు, గరుడ వంటి అయిదు ముఖాలతో భక్తులకు దర్శనం కల్పిస్తారు.

ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు స్వామివారి గర్భగుడి చుట్టూ 21 ప్రదక్షణలు చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.ఈ ఆలయంలో ప్రతి ఏటా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి వంటి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ప్రతి శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.ఇప్పటికీ భారతదేశం నుంచి కొన్ని రాష్ట్రాల వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

అదేవిధంగా పాకిస్థాన్ లో నివసించేటటువంటి హిందువులతో పాటు కొందరు ముస్లింలు కూడా ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం విశేషమని చెప్పవచ్చు.

#Uniqueness 1500 #Pakistan #PakHindu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU