రోజు నైట్ ఈ టీ తాగితే వద్దన్నా సరే నిద్ర ముంచుకొస్తుంది!

This Is The Super Effective Tea To Get Rid Of Insomnia! Insomnia, Saffron Tea, Saffron Tea Health Benefits, Good Health, Latest News, Good Sleep , Sleeping

సాధారణంగా కొందరికి రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు.ఎంత ప్రయత్నించినా కంటికి కునుకు రాదు.

 This Is The Super Effective Tea To Get Rid Of Insomnia! Insomnia, Saffron Tea,-TeluguStop.com

దీన్నే నిద్రలేమి( Insomnia ) అంటారు.ఇది పెద్ద సమస్య కాదు అనుకుంటే పొరపాటే అవుతుంది.

నిద్రలేమిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, మధుమేహం, మెదడు పనితీరు మందగించడం, డిప్రెషన్, ఊబకాయం ఇలా ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు తలెత్తుతాయి.అందుకే నిద్రలేమికి చెక్ పెట్టడం ఎంతో అవసరం.

అయితే మందులతోనే కాదు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Telugu Sleep, Insomnia, Latest, Saffron Tea, Saffrontea-Telugu Health

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే టీని రోజు నైట్ తాగితే వద్దన్నా సరే నిద్ర ముంచుకొస్తుంది.నిద్రలేమి పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీ ఏంటో.

దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.కుంకుమపువ్వు టీ..( Saffron tea ) నిద్రలేమిని నివారించడానికి ఒక న్యాచురల్ మెడిసిన్ మాదిరి పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు.

కుంకుమపువ్వు టీ ని తయారు చేసుకోవడం పెద్ద కష్టమైన పని కూడా కాదు.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి.

పాలు కాస్త హీట్ అయిన తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు వేసుకోవాలి.అలాగే రెండు దంచిన యాలకులు వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన కుంకుమపువ్వు టీను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడమే.రోజు నైట్ ఈ టీ ను తీసుకోవడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది.

Telugu Sleep, Insomnia, Latest, Saffron Tea, Saffrontea-Telugu Health

నిద్రను ప్రేరేపించే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.సుఖమైన ప్రశాంతమైన నిద్ర‌ మీ సొంతం అవుతుంది.కాబట్టి ఎవరైతే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారో వారు ఖ‌చ్చితంగా నైట్ నిద్రించే ముందు ఒక కప్పు కుంకుమ పువ్వు టీను తీసుకోండి.

ఈ టీ వల్ల మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ముఖ్యంగా కుంకుమ పువ్వు టీ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.కంటి చూపును రెట్టింపు చేస్తుంది.క్యాన్సర్( Cancer ) వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.

ఏమైనా పుండ్లు ఉంటే త్వరగా హీల్ అయ్యేలా చేస్తుంది.మరియు ఆస్తమా లక్షణాలను సైతం అదుపులోకి తెస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube