Rajamouli, Puri Jagannath, RGV : రాజమౌళి, పూరీ జగన్నాథ్, ఆర్జీవీ మధ్య పోలిక ఇదే.. ముగ్గురికీ ఆ నమ్మకాలు అస్సలు లేవంటూ?

రాజమౌళి, పూరీ జగన్నాథ్, ఆర్జీవీ ( Rajamouli, Puri Jagannath, RGV ) పేర్లు వింటే అభిమానులకు ఈ దర్శకులు తెరకెక్కించిన సినిమాల పేర్లు గుర్తుకు వస్తాయి.ఈ ముగ్గురు దర్శకులలో ఒక్కొక్కరు ఒక్కో తరహా సినిమాలను ఇష్టపడతారు.

 This Is The Similarity Between Rajamouli Puri Jagannath And Rgv Details Here-TeluguStop.com

ఈ దర్శకులను అభిమానించే అభిమానులు భారీ స్థాయిలోనే ఉండగా కొంతమంది మాత్రం ఈ దర్శకుల సినిమాలపై విమర్శలు చేస్తూ ఉంటారు.అయితే ఈ ముగ్గురు దర్శకుల మధ్య ఉన్న ఒక పోలిక నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

రాజమౌళి దేవుడిని నమ్మరని ఆయన అభిమానులకు ఇప్పటికే తెలుసు.అయితే రాజమౌళితో పాటు దేవుడిపై నమ్మకం లేని దర్శకుల జాబితాలో పూరీ జగన్నాథ్, ఆర్జీవీ కూడా ఉన్నారు.

దేశం మొత్తానికి సుపరిచితులైన ఈ దర్శకులు తమ సినిమాలలో దేవుడిని సంబంధించిన సీన్లను పెట్టే ఈ దర్శకులు దేవుడిని నమ్మకపోవడం మాత్రం ఆశ్చర్యమే అని చెప్పవచ్చు.రాజమౌళి, పూరీ, వర్మ తమ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకులు( Directors ) కాగా వర్మ మాత్రం ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.

Telugu Directors, Liger, Puri Jagannath, Rajamouli, Similarity, Vyooham-Movie

వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన వ్యూహం సినిమా( Vyooham ) తాజాగా థియేటర్లలో విడుదలై నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు కొంతమంది రివ్యూవర్లు 0, 0.5 రేటింగ్ కూడా ఇచ్చారు.2014 ఎన్నికల్లో ఓడిపోతాడని జగన్ కు ముందే తెలుసని వర్మ ఈ సినిమాలో చూపించారు.వ్యూహం సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.

Telugu Directors, Liger, Puri Jagannath, Rajamouli, Similarity, Vyooham-Movie

పూరీ జగన్నాథ్ తన సినిమాలతో గతంలో చేసిన స్థాయిలో మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.లైగర్ ( Liger )తో నిరాశపరిచిన పూరీ డబుల్ ఇస్మార్ట్ తో భారీ సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి.రాజమౌళికి వరుస విజయాలు దక్కుతున్నా ఇతర దర్శకుల నుంచి గట్టి పోటీ ఉండటంతో జక్కన్న తన సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube