ఎన్నో సినిమాల్లో తన చక్కటి నటనతో జనాలను మైమరిపించిన నటి శారద.ఈమెకు తొలిసారి జాతీయ ఉత్తమ నటిగా ఊర్వశి అవార్డును అందించిన సినిమా స్వయంవరం.1972లో ఈ సినిమా మలయాళంలో విడుదల అయ్యింది.ఈ సినిమాలో మధు హీరోగా నటించాడు.
శారద హీరోయిన్ గా చేసింది.ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని నూతన దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ శారదకు వినిపించాడు.
ఆ సమయంలో శారద మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో సినిమా షూటింగ్ లో ఉన్నారు.చక్కటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తప్పకుండా నటించాలని దర్శకుడు కోరాడు.
ఈ స్టోరీ వినగానే తనకు చాలా నచ్చింది.అంతేకాదు.
తన నటనకు జాతీయ అవార్డు రావడం పక్కా అనుకుంది శారద.ఆమె అనుకున్నట్లుగానే సినిమా చాలా బాగా ఆడింది.
జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపిక అయ్యింది.తనతో పాటు డైరెక్టర్‌గా ఆదూర్ గోపాలకృష్ణన్, సినిమాటోగ్రాఫర్‌గా మంకడ రవివర్మ సైతం జాతీయ అవార్డులు అందుకున్నారు.
అటు ఈ సినిమాలో ఓ సీన్ అవార్డుల కమిటీ సభ్యులకు బాగా నచ్చింది.ఇందులో హీరోయిన్ నిండు గర్భిణిగా ఉంటుంది.ఆ సమయంలో బిందెతో నీళ్లు తీసుకెళ్తుంది.ఈ సినిమా నాటికి శారద వయసు చాలా తక్కువ.
గర్భిణీలలు ఎలా ఉంటారో తెలియని వయసు.కానీ.
తను ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది.ఈ సీన్ అవార్డుల కమిటీ సభ్యులు అందరికీ బాగా నచ్చింది.
అందరూ తన నటనకు దాసోహం అన్నారు.ఏకగ్రీవంగా తనకే జాతీయ అవార్డును ప్రకటించారు.పలు సందర్భాల్లో శారద కనిపించినప్పుడు స్వయంవరం సిననిమా సీన్ ను పదే పదే గుర్తు చేసే వారు జ్యూరీ మెంబర్‌గా ఉన్న దర్శకుడు మృణాల్ సేన్.
అటు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదూర్ గోపాలకృష్ణన్‌కు స్వయంవరం‘ తొలి ఫీచర్ ఫిల్మ్.
అంతకు ముందు కొన్ని డాక్యుమెంటరీలు మాత్రమే తీశాడు.ఈ అద్భుత సినిమా తీసి దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరిగా కీర్తి ప్రతిష్ఠలు పొందాడు.
విశ్వం, సీత పాత్రల్లో మధు, శారద నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.స్వయంవరం సినిమా చరిత్రంలో చిరస్థాయిగా నిలిచింది.