సొంతంగా సంపాదించిన రిచెస్ట్ సెలబ్రిటీ కపుల్ ఇదే.. మరిన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమిటంటే?

సొంతంగా డబ్బు సంపాదించుకుంటే వచ్చే గుర్తింపు వేరు.వారసత్వంగా సంపాదించుకునే గుర్తింపు వేరు.

 This Is The Richest Celebrity Couple Have Ever Owned And Some Interesting Thing-TeluguStop.com

ఎందుకంటే వారసత్వానికి వచ్చే సంపాదనలో అంత గౌరవం ఉండదు.అదే సొంతంగా డబ్బు సంపాదించుకుని ఒక హోదా లో ఉన్నట్లైతే ఆ గౌరవం చివరి కాలం వరకు ఉంటుంది.

అలా సినీ ఇండస్ట్రీలో కూడా సొంతంగా సంపాదించి రిచెస్ట్ సెలబ్రిటీగా ఒక కపుల్ మంచి పేరు సంపాదించుకుంది.ఇంతకు ఆ కపుల్ ఎవరో కాదు.

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ.వీరిద్దరూ ప్రస్తుతం రిచెస్ట్ సెలబ్రేటి కపుల్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.వీరిద్దరు తమ హోదాతో మంచి గౌరవాన్ని సంపాదించుకున్నారు.ఇద్దరూ వేర్వేరు రంగంలో ఉన్న కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ తమ రంగాల్లో బిజీ గా మారి మంచి జీవితాన్ని గడుపుతున్నారు.

Telugu Anushka, Bollywood, Kohli-Movie

తమ రంగాలలో సొంతంగా అడుగుపెట్టి బాగా సంపాదించారు.తమ వ్యక్తిగత జీవితం లోనే కాకుండా దంపతులుగా కూడా వీరిద్దరు సంపాదనలో ఐక్యమత్యంగా ఉన్నారు.వీరి ఆస్తులు కూడా చాలా ఉన్నాయి అని తెలుస్తుంది.నిజానికి వందల కోట్లల్లో వీరి ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది.స్టార్ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ సంపాదించుకున్న ఆస్తులు 100 కోట్ల రూపాయలకు పైనే అని.అంతేకాకుండా హీరోయిన్ గా, నిర్మాతగా కూడా అనుష్క శర్మ బాగా రాణిస్తుంది అని తెలుస్తుంది.

అనుష్క నిర్మాతగానే కాకుండా క్లోత్ బ్రాండ్లకు ఓనర్ గా కూడా బాధ్యతలు చేపట్టింది.నుష్ అనే పేరుతో ఆమె బట్టల వ్యాపారం చేస్తుందట.ఇక దాని విలువ దాదాపు 65 కోట్ల రూపాయలు ఉంటాయని తెలుస్తోంది.విరాట్ కోహ్లీకి గుర్గావ్ లో 80 కోట్ల రూపాయల విలువ చేసే ఒక పెద్ద బంగ్లా ఉందట.

అనుష్కకు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే లాండ్ రోవర్ కారు, విరాట్ కోహ్లీకి ఒక్కోటి నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే రెండు కార్లు ఉన్నాయట.

Telugu Anushka, Bollywood, Kohli-Movie

ముంబైలో అనుష్కకు సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేసే ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్ ఉందట.అంతేకాకుండా అంథేరీలో 4 కోట్ల రూపాయల విలువ చేసే మరో ఇల్లు కూడా ఉందట.ఇక వీరికి కేవలం విలువైన బంగ్లాలు, కారు లే కాకుండా విలువైన హ్యాండ్ బ్యాగ్ లు, లగ్జరీ వాచ్ లు కూడా ఉన్నాయట.

ఇక వీరిద్దరికీ కలిపి ముంబైలో ఒక ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉందని.దీని విలువ 34 కోట్ల రూపాయల ఉంటుందని తెలుస్తుంది.

అంతే కాకుండా సొంతంగా పలు వ్యాపారాలు కూడా ప్రారంభించారు అని తెలుస్తుంది.ఇక భవిష్యత్తులో ఈ జంట ఇంకెంత సంపాదించుకుంటారో చూడాలి.

ప్రస్తుతం వీరిద్దరు తమ రంగాల్లో బాగా బిజీగా ఉన్నారు.మిగతా సమయం ఫ్యామిలీ పరంగా మంచి సమయాన్ని కేటాయిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube