శివుడి పాత్రలో నటించే హీరోలు నిజమైన పామును మెడలో ఎందుకు ధరించరో మీకు తెలుసా?

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది స్టార్స్ శివుడి పాత్రలలో నటించి మెప్పించారు.

 This Is The Reasons Actors Do Not Wearing Snakes While Shooting Details, Snakes,-TeluguStop.com

శివుడు అంటే కచ్చితంగా శివుడి మెడలో పాము ఉంటుందనే సంగతి తెలిసిందే.అయితే సినిమాలలో శివుడి పాత్రలో కనిపించే వ్యక్తులు నిజం పాముకు బదులుగా లోహంతో తయారు చేసిన పామును ఎక్కువగా ధరించారు.

సీనియర్ ఎన్టీఆర్ పలు సినిమాల్లో శివుడి పాత్రల్లో నటించగా ఆ సినిమాల్లో ఎన్టీఆర్ సర్పాన్ని ధరించలేదు.శ్రీ మంజునాథ సినిమాలో శివుడి పాత్రలో కనిపించిన చిరంజీవి సైతం నిజమైన పామును ధరించలేదనే సంగతి తెలిసిందే.

తమిళంలో శివాజీ గణేషన్ పలు సినిమాల్లో శివుడి పాత్రలో నటించగా శివాజీ గణేషన్ కూడా లోహ సర్పాన్ని ధరించడం గమనార్హం.బ్రహ్మచారి సినిమాలో కమల్ హాసన్ మాత్రం కొంత సమయం పాటు పామును మెడలో వేసుకొని కనిపించారు.

అయితే శివుడి పాత్రను పోషించే నటులు మెడలో పామును ధరించకపోవడం వెనుక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

Telugu Bhakthi, Bhrahmachari, Chiranjeevi, Kamal Hasan, Snake, Shivaratri, Sr Nt

సర్పం తిన్నగా ఉండదు కాబట్టి షూటింగ్ సమయంలో పాము అటూఇటూ కదిలితే సమయం వృథా అవుతుంది.కొన్ని పాములకు విషం లేకపోయినా పాము పాకుతూ ఉంటే కొందరు నటులు ధైర్యంగా షూటింగ్ లో పాల్గొనలేరనే సంగతి తెలిసిందే.పాము వల్ల నిర్మాతలకు ఖర్చులు కూడా పెరుగుతాయి.

Telugu Bhakthi, Bhrahmachari, Chiranjeevi, Kamal Hasan, Snake, Shivaratri, Sr Nt

నిజమైన పామును మెడలో వేసుకుని నాట్యం చేయడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.ఈ కారణాల వల్లే దర్శకనిర్మాతలు సినిమాల్లో నిజమైన పాముకు బదులుగా లోహసర్పానికి ప్రాధాన్యత ఇస్తారు.ప్రస్తుతం సినిమాలలో జంతువులను వాడటం కూడా గతంతో పోలిస్తే తగ్గింది.ప్రస్తుతం జంతువులను చూపించాల్సి వస్తే గ్రాఫిక్స్ ద్వారా చూపించడానికి దర్శకనిర్మాతలు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube