ప‌వ‌న్ విష‌యంలో పోటీ ప‌డుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. కార‌ణం ఇదే

రాజకీయాలు మారుతున్నాయి.ఒక‌ప్పుడు ఎంతో హుందాగా సాగే రాజ‌కీయాలు ఇప్పుడు దారుణంగా త‌య‌రయ్యాయి.

 This Is The Reason Why Ycp Mlas Are Contesting In The Pawan Issue, Ycp Mlas, Pa-TeluguStop.com

ఒక‌ప్పుడు న‌లుగురు పొగిడితేనే గొప్ప నేత అనేవారు.కానీ ఇప్పుడు ఎంత తిడితే అంత పెద్ద నాయ‌కుడు అనే రేంజ్‌లోకి తీసుకువ‌చ్చారు మ‌న పార్టీల నేత‌లు.

ప్ర‌స్తుతం ఏపీలో కూడా ఇలాంటి ప‌రిస్థితే జ‌రుగుతోంది.వైసీపీ ఎమ్మెల్యులు చాలామంది ఇప్పుడు మంత్రి ప‌ద‌విపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

రాబోయే కొద్ది రోజుల్లోనే కేబినెట్ మార్పులు ఉంటాయ‌న్న వార్త ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల‌కు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు.

దీంతో ఎలాగైనా అధినేత దృష్టిలో ప‌డాల‌ని నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇందుకోసం మీడియా ముందుకు ఎన్న‌డూ రాని వారు కూడా వచ్చి జగన్ కంట్లో పడేందుకే ఏవేవో మాట్లాడేస్తున్నారు.ప్ర‌త్య‌ర్థుల‌ను గ‌ట్టిగా తిడితేనే జ‌నాల్లో త‌మ గురించి చ‌ర్చ జ‌రుగుతుంద‌ని మీడియాలో హైలెట్ అవుతామ‌నే భావ‌న‌లో ఉంటున్నారు.

ఇన్ని రోజులు పాత వారంతా ఎలాగూ టీడీపీని తిట్టి రొటీన్ చేసేశారు.అందుకే ఇప్పుడు కొత్త స్ట్రాట‌జీని ఎత్తుకున్నారు.అందుకే రూట్ మార్చి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేశారు.ప‌వ‌న్‌ను ఎంత తిడితే త‌మ‌కే అంత పాపులారిటీ ద‌క్కుతుంద‌ని అనుకుంటున్నారు.

Telugu Ap Potics, Chndra Babuau, Ghandi Srinivas, Janaseena, Pawan Kalyan, Srini

ఈ నేప‌థ్యంలోనే మంత్రి ప‌ద‌వుల్లో ఉన్న వారితో పాటు మంత్రి ప‌ద‌వి కోసం ఆశ‌ప‌డుతున్న వారు కూడా ఇదే ప్లాన్ వ‌ర్కౌట్ చేస్తున్నారు.రీసెంట్ గా పవన్ మీద భీమవరంలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ఇదే కోవ‌లోకి వ‌చ్చేశారు.మ‌రోసారి ప‌వ‌న్ భీమ‌వ‌రంలో పోటీ చేసే అవ‌కాశం ఉన్నందున ఈసారి శ్రీనివాస్‌కు పెద్ద ప‌ద‌వి ఇచ్చి తిరుగులేని విధంగా త‌యారు చేయాల‌నే ప్లాన్ లో వైసీపీ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.అందుకే ఆయ‌న కూడా దాన్ని వాడుకునేందుకు ప‌వ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిపోశారు.

ఇలా ఆయ‌నే కాదు అంద‌రూ ప‌వ‌నే దిక్కు అన్న‌ట్టు ఆయ‌న‌మీద విరుచుకుప‌డుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube