వాట్సాప్ చాటింగ్స్ ప్రతిసారీ లీక్ అవ్వడానికి కారణమిదే..!

This Is The Reason Why Whatsapp Chats Are Leaked Every Time

ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాడే మెసేంజర్ యాప్ ఏదన్నా ఉంది అంటే అది వాట్సాప్ అనే చెప్పవచ్చు.అయితే ఈ వాట్సాప్ చాట్ చాలాసార్లు ఎందుకు లీక్ అవుతుందో తెలియడం లేదు.

 This Is The Reason Why Whatsapp Chats Are Leaked Every Time-TeluguStop.com

మెసేజ్ చేసేవారు.అలాగే మెసేజ్ రిసీవ్ చేసుకునే వారు తప్పా మూడో వ్యక్తి వాట్సాప్ చాట్ ను యాక్సస్ చేయలేరు అని వాట్సాప్ ఎప్పటినుంచి చెప్పుకుంటూ వస్తుంది.

మరి ప్రతిసారీ బాలీవుడ్ సెలబ్రిటీల వాట్సాప్ చాట్స్ ఎలా లీక్ అయ్యి బయటకు వస్తున్నాయి.? అసలు వాట్సాప్ వాడడం యూజర్లకు సురక్షితమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.చాట్‌ లను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అని.యూజర్ తప్ప మరెవరూ చూడలేరని వాట్సాప్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది.కానీ బాలీవుడ్‌ లో ప్రతిసారీ, ఎవరో ఒక స్టార్ వాట్సాప్ చాట్‌ లు లీక్ అవుతూనే వస్తున్నాయి.

 This Is The Reason Why Whatsapp Chats Are Leaked Every Time-వాట్సాప్ చాటింగ్స్ ప్రతిసారీ లీక్ అవ్వడానికి కారణమిదే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

2020 ఏడాదిలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి చెందిన వాట్సాప్ చాట్‌లు, నటి దీపికా పదుకొనే, అనన్య పాండే, షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ తో చేసిన చాటింగ్‌ లు కూడా లీకయ్యాయి.ఈ సంఘటనలన్నీ పరిశీలిస్తే వాట్సాప్ మెసేజ్‌ లు నిజంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయినట్టేనా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది.కానీ వాట్సాప్ చాట్ ను మూడవ వ్యక్తి కూడా యాక్సెస్ చేయలేరు.

అంత భద్రత ఉంటుందఅంటున్నారు వాట్సాప్ యాజమాన్యం వాళ్ళు.వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సిగ్నల్ ప్రోటోకాల్‌ ద్వారా ఈ సెక్యూరిటీ ఫీచర్ పనిచేస్తుంది.

థర్డ్ పార్టీల ద్వారా వాట్సాప్‌ ను మెసేజ్‌లు లేదా కాల్స్ యాక్సెస్ చేయకుండా ఈ సెక్యూరిటీ ఫీచర్ ప్రొటెక్ట్ చేస్తుందట.

Telugu Anaya Pandey, Chats, Deepika Paduona, Hide, Latest News, Lekage, Reason, Riya Chakravarthi, Whats Up-Latest News - Telugu

నిజానికి ఈ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ డేటాలోకి మూడవ వ్యక్తి చొరబడటం అసాధ్యమనే చెప్పాలి.మరి ఎలా వాట్సప్ చాట్‌ లు లీక్ అవుతాయన్నదే ప్రతి ఒక్కరిలో మెదిలే ప్రశ్న.అయితే ఈ యాక్సెస్ కేవలం మీ ఫోన్ అన్ లాక్ అయినప్పుడు మాత్రమే జరుగుతోంది.

అది ఎలా అంటే మీతో ఉండేవారిలో ఎవరో ఒకరు మీ ఫోన్ అన్ లాక్ చేసి ఇవ్వమని అడిగినప్పుడు మీరు మీ ఫోన్ అన్ లాక్ చేసినప్పుడు ఆ చాట్స్ ఇతరులు యాక్సస్ చేసుకునే వీలుంది.అలా అన్‌ లాక్ చేసిన తర్వాత అన్ని చాట్‌ లు అందుబాటులో ఉంటాయి.

వాటిని స్క్రీన్‌ షాట్‌ లను తీసుకోవచ్చు.లేదంటే వాటిని కాపీ చేయవచ్చు, షేర్ చేయవచ్చు.

అలా ఎవరన్నా యాక్సిస్ చేస్తే తప్పా మీ వాట్సాప్ చాట్స్ మూడవ వ్యక్తికి తెలిసే అవకాశం లేదు.

#Anaya Pandey #Chats #Lekage #Deepika Paduona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube