ఏకంగా కెసీఆర్ రంగంలోకి దిగాల్సి రావడానికి గల కారణం ఇదే

ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి  అధ్యక్షుడి నుండి మొదలుకొని క్షేత్ర స్థాయి వరకు ఒక పటిష్ట కార్యవర్గాన్ని నిర్మించుకుంటాయన్న విషయం తెలిసిందే.అయితే చాలా అధ్యక్షుని స్థాయి వారు చాలా కీలక సమయాల్లో మాత్రమే తమ అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేస్తారు తప్ప ప్రతి ఒక్క సందర్భంలో మాత్రం తమ అభిప్రాయాన్ని తెలిపే అవకాశం ఉండదు.

 This Is The Reason Why Kcr Has To Enter The Field All At Once Bjp Party, Kcr , T-TeluguStop.com

ఎందుకంటే ప్రతి ఒక్క స్థాయిలో ఒక పార్టీ పదవిలో ఉన్న నాయకుడు ఉంటారు కాబట్టి పరిస్థితి తీవ్రతను బయటి వారు సమాధానమిస్తూ వెళతారు.ఇలా ఆ  ఒక్క పార్టీ అని కాదు, ప్రతి ఒక్క పార్టీ కూడా ఇలానే వ్యవహరిస్తుంది.

అయితే ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం మనం చూస్తున్నాం.అయితే ప్రతిపక్షం చేసే విమర్శలకు  టీఆర్ఎస్ నేతలు సమాధానమిస్తున్నారు.

అయితే టీఆర్ఎస్ నేతలు ఇస్తున్న సమాధానాలు ప్రజల్లోకి పోవడం లేదనే ఉద్దేశ్యంతో తద్వారా రైతులు ప్రతిపక్షాల రాజకీయ మైండ్ గేమ్ లో పడడం ద్వారా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Bandi Sanjay,

అయితే కేసీఆర్ వేసిన ఈ అడుగు బీజేపీని కోలుకోలేని స్థితికి తీసుకువస్తుందని, ఇక గత రెండు రోజులులా నేడు, రేపు కూడా ప్రెస్ మీట్ పెడతానని రైతుల ధాన్యం కొంటామని ప్రకటించే వరకు బీజేపీని వదిలిపెట్టనని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో నిన్నటి ప్రెస్ మీట్ లో కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు బీజేపీ నుండి ఇంకా సమాధానం రాలేదు.మరి కేసీఆర్ రంగంలోకి దిగడంతో బీజేపీ ఇక తన వ్యూహాలను మార్చుకోవలసిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు .మరి కేసీఆర్ భవిష్యత్ వ్యూహం ఎలా ఉంటుందనేది రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube