ఆ భయంతోనే ముందస్తుకు కేసీఆర్ వెనకడుగు ?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల కు సంబంధించి గత కొంత కాలంగా అనేక ప్రచారాలు వినిపిస్తున్నా, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని, టిఆర్ఎస్ నాయకులే స్వయంగా వ్యాఖ్యానించేవారు.దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ వ్యవహారాలు ఉండేవి ఎప్పుడూ లేని హడావుడి పడుతూ ఎన్నికల సందడి మొదలైపోయిందా అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించేవారు.

 This Is The Reason Why Kcr Has Given Up The Idea Of-​ Going For Early Election-TeluguStop.com

దీనిపై కెసిఆర్ ఎప్పుడు స్పందించకపోవడంతో, రకరకాల ఊహాగానాలు వస్తునే ఉన్నాయి.అయితే రెండు రోజుల క్రితం ముందస్తు ఎన్నికల విషయంపై పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా కేసీఆర్ స్పందించారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమకు లేదని ,సాధారణ ఎన్నికలు మాత్రమే తెలంగాణ జరుగుతాయని కెసిఆర్ క్లారిటీ ఇచ్చారు.

         దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేసీఆర్ ఎందుకు వాయిదా వేసుకున్నారు అనే విషయంపై కొత్త చర్చలు మొదలయ్యాయి.2014 ఎన్నికల ఫలితాలు కెసిఆర్ పెద్ద సంతృప్తిని ఇవ్వలేదు.దీంతో పాటు తెలంగాణలో బిజెపి పుంజుకోవడం తదితర పరిణామాలతో కెసిఆర్ 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించారు.

ఇప్పుడు అదే లెక్కల్లో ముందస్తు ఎన్నికలకు వెళతారని అందరూ అభిప్రాయపడ్డారు.కేసీఆర్ మాత్రం వెనుకడుగు వేశారు.దీనికి కారణాలు చాలా ఉన్నాయి.ప్రస్తుతం బీజేపీతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ కూడా బలం పుంజుకుంది.

కాంగ్రెస్ మరింతగా బలపడుతుందని ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ కాంగ్రెస్ మధ్య చీలి తమకు కలిసి వస్తుంది అనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారు.
   

Telugu Congress, Dalitha Bandhu, Etela Rajendar, Hujurabad, Telangana-Telugu Pol

    అందుకే బిజెపి కాంగ్రెస్ లు మరికొంత బలపడాలి అని కేసీఆర్ కోరుకుంటున్నారు.ఇదే కాకుండా కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు కాకుండా మిగిలిపోయాయి.అలాగే దళిత బంధు పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు.

దీని కోసం లక్ష కోట్ల బడ్జెట్ అవసరం.ఈ నిధుల సమీకరణ చేయడం కష్టం .అందుకే సాధారణ ఎన్నికల లోపు ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి మళ్లీ అధికారంలోకి రావాలనే వ్యూహంలో కేసీఆర్ ఉన్నట్టుగా అర్దం అవుతోంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube