ఐఫోన్లలో 80 శాతం కంటే మించి ఎక్కని ఛార్జింగ్.. కారణం అదే..

ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్‌లో యాపిల్ ఐఫోన్‌ను మించిన ఫోన్ లేదని చెప్పనవసరం లేదు.ఐఫోన్ అధునాతన ఫీచర్లు, అత్యద్భుతమైన ఓఎస్ అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది.

 This Is The Reason Why Apple Iphones Not Charged More Than 80 Percent Of Battery-TeluguStop.com

అయితే తాజాగా భారత ఐఫోన్ యూజర్లు ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు.ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా తెలియక ఆందోళన కూడా చెందుతున్నారు.

ఈ సమస్యకు కారణం ఏంటో తెలియక సతమతమవుతున్నారు.

ఇంతకీ ఏంటా సమస్య అనేది తెలుసుకుంటే.ఇండియన్ యూజర్లు ప్రస్తుతం ఐఫోన్‌ను ఛార్జింగ్ చేస్తుంటే 80 శాతం కంటే ఎక్కువ ఛార్జింగ్ అవ్వట్లేదు.20 శాతం ఛార్జింగ్ కోల్పోవడం వల్ల యూజర్లు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు.ఇలా జరగడానికి కారణం ఏంటి? బ్యాటరీ పాడయిందా లేక ఇంకేదైనా టెక్నికల్ సమస్య? అని యాపిల్ కంపెనీకి చాలా మంది యూజర్లు ఇప్పటికే రిపోర్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం యాపిల్ వీరి ఫిర్యాదులపై స్పందించింది.

యూజర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇది పెద్ద సమస్సే కాదని చెబుతూ ఇలా జరగడానికి గల కారణం వివరించింది.

ఐఫోన్‌లోని ఒక ప్రత్యేకమైన ఫీచర్ వల్లే ఈ సమస్య తలెత్తుతుందని యాపిల్ పేర్కొంది.

యూజర్ల సేఫ్టీ మేరకు ఐఫోన్లలో డీఫాల్ట్‌గా ఈ ఫీచర్‌ను అందించినట్లు యాపిల్ సంస్థ చెప్పింది.ఈ ఫీచర్ వల్ల ప్రతికూల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఫోన్ తక్కువగా ఛార్జ్ అవుతుందని.

Telugu Percentage, Apple Company, Apple Iphone, Iphone, Iphone Safety, Ups-Lates

తద్వారా ఫోన్ డామేజ్ అవ్వదని, యూజర్లకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని యాపిల్ కంపెనీ తెలిపింది.సున్నా నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఫోన్ ఉన్నప్పుడే ఛార్జింగ్‌ పూర్తిగా ఎక్కుతుందని వెల్లడించింది.సున్నాకు తక్కువ ఉన్నా, 35 డిగ్రీలు దాటినా వెంటనే ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్‌ స్పందించి ఛార్జింగ్‌లో మార్పులు చేస్తుందని వివరించింది.

ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ 100% ఛార్జింగ్‌ అవుతుందని తెలిపింది.మన దేశంలో ఈ ఏడాది సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు అధిక డిగ్రీల్లో నమోదయ్యాయి.35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయింది కనుక ఐఫోన్‌లలో ఛార్జింగ్ తక్కువగా ఎక్కే సమస్య తలెత్తింది.అయితే ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అని తెలుసుకున్న యూజర్లు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube