ఆ సర్వేతో దడ ... 'దళిత బంధు ' వెనుక పరమార్థం ఇదే ?

‘ దళిత బంధు ‘ అంటూ తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ సంచలన , భారీ బడ్జెట్ పథకం తెలంగాణ లోనే కాదు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే అయింది.ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందించే ఈ భారీ ఈ పథకం అమలు సాధ్యమేనా అన్న సందేహాలు అందర్లోనూ నెలకొన్న కేసీఆర్ మాత్రం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

 This Is The Reason Kcr Setting Up Dalita Bandhu Scheme In Huzurabad,  Kcr, Telan-TeluguStop.com

ప్రస్తుతానికి హుజూరాబాద్ నియోజకవర్గం లోనే ఈ పథకాన్ని అమలు చేయబోతున్న , ఆ తర్వాత తెలంగాణ అంతటా దీనిని అమలు చేస్తామని చెబుతున్నారు.ఈ దళిత బంధు పథకం పై అవగాహన సదస్సులు నిర్వహించే పనుల్లో సీఎం కేసీఆర్ నిమగ్నమయ్యారు.

ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం అంటే ఆషామాషీ కాదు.

తెలంగాణలో దీని కోసం లక్షల కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యమా అనే సందేహాలు అందర్లోనూ వ్యక్తం  కేసీఆర్ మాత్రం ఆ హామీలు అమలు చేసి తీరుతా అంటూ శపధాలు చేస్తున్నారు.అసలు దళిత బందు పథకాన్ని ఇంత హడావుడిగా అమలు చేయడం , ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఎవరికీ అంతుపట్టడం లేదు.

అయితే దీని వెనకాల చాలా కథే ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అక్కడ గెలిచేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు.ఇప్పటికే అనేకసార్లు హుజురాబాద్ నియోజకవర్గ పరిస్థితిపై సర్వే చేయించిన కేసీఆర్ కు ఆ సర్వేలో వచ్చిన ఫలితాలు ఆందోళన పెంచడం దాదాపు 35 వేల ఓట్ల తేడాతో ఈటెల రాజేందర్ గెలవబోతున్నారు అనే రిపోర్ట్ తో కేసీఆర్ అలెర్ట్ అయ్యారట.

Telugu Congress, Dalitha Bandhu, Hujurabad, Hujursbad Sarvy, Telangana-Political

హుజూరాబాద్ నియోజకవర్గం లో రాజేందర్ కు సానుభూతి చాలానే ఉందని, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత గతంతో పోలిస్తే బాగా పెరిగిందని, ఇక్కడ గెలవడం దాదాపు కష్టమైన పని అని అన్నట్లుగా ఇంటలిజెన్స్ రిపోర్ట్ రావడంతో ఆలోచనలో పడ్డ కేసీఆర్ దాదాపు నలభై వేల ఓట్లు ఉన్న దళిత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడం ద్వారా, రాజేందర్ గెలుపు దక్కకుండా చేయాలని చూస్తున్నారు.అందుకే ఈ దళిత బందును ఇంతగా హైలెట్ చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.సర్వే రిపోర్టులో టీఆర్ఎస్ గెలుపు కు డొఖా లేదు అనే రిపోర్ట్స్ వస్తే అసలు దళిత బంధు వచ్చి ఉండేది కాదు అనేది టీఆర్ఎస్ ప్రత్యర్థుల మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube