ముసుగు తీసిన పవన్..ఇదీ అసలు లెక్క..??  

  • ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధినేతల ముసుగులు ఒక్కొక్కటిగా తొలగిపోతూ వస్తున్నాయి. చంద్రబాబు పై ఉన్న అపారమైన ప్రేమ అభిమానం ఒక్కొక్కటిగా బయటకు పొంగి పొర్లుతోంది. ఆయనతో ఉన్న అనుభందం బయట పడుతోంది. ప్రత్యేక హోదా అంటూ జబ్బలు చరుచుకున్న శివాజీ , పరుచూరి అశోక్ బాబు, ఇలా ఒక్కొక్కరూ బాబు పంచన చేరి భజనలు చేస్తున్నారు వీరి ఒకే ఒక్క టార్గెట్ జగన్ అధికారంలోకి రాకూడదు.

  • This Is The Reality Of Pawan Kalyan-Janasena Party Pawan Kalyan Janasena Tdp Tieup With Ycp Ys Jagan

    This Is The Reality Of Pawan Kalyan

  • అయితే ఇప్పుడు ఈ లిస్టు లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయారు అంటున్నారు రాజకీయ ఉద్దండులు. నిన్నటి రోజున ఆవిర్భావ సభ తరువాత వినిపిస్తున్న టాక్ ఏమిటంటే పవన్ జనసేనాని కాదు, తెలుగుదేశ పార్టీకి సేనాని అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు పవన్ మనసులో ఏముంది. ఎందుకు ఒక్క జగన్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడటం

  • రాజమండ్రి లో నిన్నటి రోజున జరిగిన సభలో పవన్ ప్రసంగం ఆద్యంతం టీడీపీ పార్టీ జగన్ ని టార్గెట్ చేసిన పాయింట్ల తోనే సాగింది. రాజధానిలో జరిగిన భూ కుంభకోణం కానీ, లోకేష్ పై ఎప్పుడూ చేసే అవినీతి ఆరోపణలు కాని ఇసుక మాఫియా వ్యవహారం కానీ, చింతమనేని వ్యవహారం కాని ఎక్కడా తన ప్రసంగాలలో రాకపోవడం చర్చనీయంసం అవుతోంది. రాష్ట్రాన్ని విడగొట్టిన కేసీఆర్ ని జగన్ ఏపీ కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ కి ఆయనకీ దోస్తీ ఏంటి అంటూ టీడీపీ మౌత్ పీస్ లా పవన్ ప్రసంగం సాగింది.

  • This Is The Reality Of Pawan Kalyan-Janasena Party Pawan Kalyan Janasena Tdp Tieup With Ycp Ys Jagan
  • అయితే నిన్నటి పవన్ తీరుని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం భవిష్యత్తులో తెలుగుదేశం , పవన్ కళ్యాణ్ ల మధ్య భంధం ఏర్పడటం ఖాయం అంటున్నారు. ఇప్పటికిప్పుడు కలవకపోయినా సరే ఎన్నికల అనంతరం బాబు అధికారంలోకి రావడానికి పవన్ తన పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెప్తున్నారు. దాంతో పవన్ , చందబాబు ల గత భంధం చెక్కు చెదరలేదని, ఇప్పటి వరకూ ఇద్దరు వేరు అన్నట్టుగా నటిచారని అర్థమవుతోంది అంటున్నారు ఏపీ ప్రజలు.