' చిరు ' కి రాజ్యసభ !  నిజం కాని నిజం ఇదే ?

This Is The Real Truth About Chiranjeevis Rajya Sabha Membership

ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితం భేటీ అయ్యారు.సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్యలు, టికెట్ల వ్యవహారం పై టాలీవుడ్ ఏపీ ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం ఇలా అనేక సమస్యలను చిరంజీవి జగన్ వద్ద ప్రస్తావించేందుకు భేటీ అయ్యారు.

 This Is The Real Truth About Chiranjeevis Rajya Sabha Membership-TeluguStop.com

ఈ భేటీ రాజకీయంగాను ప్రాధాన్యం సంతరించుకుంది.చిరు జగన్ మధ్య ఏం చర్చ జరిగింది.? వారి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, చిరు విషయంలో జగన్ సానుకూలంగానే ఉంటారు కాబట్టి ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని అంతా భావిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతోంది అని ,  అందుకే జగన్ చిరంజీవిని కలిశారని , అందుకే వైసీపీ ప్రభుత్వం విషయంలో సానుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని ఓ వర్గం మీడియా లో ప్రచారం జరుగుతోంది.

       వచ్చే జూన్ నాటికి ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.ఈ నాలుగు స్థానాలు వైసిపికి దక్కబోతున్నాయి.ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు , సుజనాచౌదరి టీజీ వెంకటేష్ స్థానాలో విజయసాయిరెడ్డి కి మరోసారి జగన్ రెన్యువల్ చేస్తారు.మిగిలిన మూడు స్థానాల్లో ఒకటి బి సి, 1 ఎస్ సి సామాజిక వర్గాలకు జగన్ కేటాయిస్తారని , మిగిలిన స్థానానికి చిరంజీవిని ఎంపిక చేస్తారనే హడావుడి మొదలైంది.

 This Is The Real Truth About Chiranjeevis Rajya Sabha Membership- చిరు కి రాజ్యసభ   నిజం కాని నిజం ఇదే -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ప్రచారం పై తాజాగా చిరంజీవి స్పందించారు.రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని,  పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టానని,  తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నారు అనేది పూర్తిగా అవాస్తవం అంటూ ఆయన మాట్లాడారు.
   

  అయినా చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం  ఇస్తున్నారనే విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుండడం వెనుక కారణాలు కూడా ఉన్నాయట.సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల విషయాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ విధంగా చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం అనే అంశాన్ని తెరపైకి తెచ్చారని అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి. 

.

this is the real truth about chiranjeevis rajya sabha membership Ap cm jagan, ysrcp, TDP, Chandrababu, cbn, rajyasabha, tollywood, pavan Kalyan, cbn, ap politics, - Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Pavan Kalyan, Rajyasabha, Tollywood, Ysrcp

this is the real truth about chiranjeevis rajya sabha membership Ap cm jagan, ysrcp, TDP, Chandrababu, cbn, rajyasabha, tollywood, pavan Kalyan, cbn, ap politics, - Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Pavan Kalyan, Rajyasabha, Tollywood, Ysrcp

#AP #Chandrababu #Rajyasabha #AP CM Jagan #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube