కేసీఆర్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ధ‌ర్నా చేయ‌డానికి అస‌లు కార‌ణం ఇదా..

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వారంతా రాబోయే కాలంలో జ‌రిగే లాభాన్ని ముందుగానే గ్ర‌హించి అందుకు త‌గ్గ‌ట్టు రాజ‌కీయాలు చేస్తారు.ఈ కోవ‌కు చెందిన వారే సీఎం కేసీఆర్‌.

 This Is The Real Reason For Doing Dharna At Kcr Dharna Chowk., Dharna Chowk, Kcr-TeluguStop.com

ఆయ‌న ముందు నుంచి ఇలాంటి రాజ‌కీయాలు చేయ‌డంలో దిట్ట‌.రాబోయే కాలంలో జ‌రిగే లాభాన్ని ముందుగానే గ్ర‌హించి అప్ప‌టిక‌ప్పుడు ప్లాన్ చేంజ్ చేసుకుంటారు.

ఏదైనా ప‌ని జ‌ర‌గ‌బోతోంద‌ని తెలిస్తే వెంట‌నే దాన్ని త‌న క్రెడిట్ అని చెప్పుకునేందుకు ఏదో ఒక మాస్ట‌ర్ ప్లాన్ వేస్తుంటారు.మొన్న ధ‌ర్నా చౌక్‌లో కేసీఆర్ చేసిన ధ‌ర్నా కూడా ఇందులో భాగ‌మే అని తెలుస్తోంది.

అదేంటి కేసీఆర్ ధ‌ర్నా చేసింది వ‌డ్లు కొన‌మ‌ని క‌దా.అది ఇంకా జ‌ర‌గ‌లేదు క‌దా అని అనుకుంటున్నారు క‌దా.కానీ అస‌లు కార‌ణం వేరే ఉందంట‌.న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను మొన్న వెన‌క్కు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.

అయితే ఈ విష‌యం కేసీఆర్‌కు ముందే తెలుసంట‌.ఇక ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకునేందుకు కేసీఆర్ వెంట‌నే ధ‌ర్నా చౌక్‌లోకి వెళ్లారు.

పైగా మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల గురించి ఎన్న‌డూ లేనంత‌గా మాట్లాడారు.వాటిని ర‌ద్దు చేయాలంటూ డిమాండ్లు కూడా చేశారు.

పైగా తాము రైతుల త‌ర‌ఫున పోరాడుతామ‌ని కూడా చెప్పారు.

Telugu Dharna Chowk, Narendra Modi, Tg, Dharnakcr, Ts-Telugu Political News

ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేసి ధ‌ర్నాచౌక్‌లో కూడా మ‌రోసారి మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలను ర‌ద్దు చేయాలంటూ డిమాండ్లు చేశారు.ఇలా చేసిన తెల్లారే ప్ర‌ధాని మోడీ వాటిని వెనక్కు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు.దీంతో కేసీఆర్ రైత‌లుకు మ‌ద్ద‌తు ఇచ్చిన వెంట‌నే ఇలా జ‌ర‌గ‌డంపై టీఆర్ఎస్ శ్రేణులు దీన్ని ప్ర‌చారం చేసుకున్నారు.

కేసీఆర్ రంగంలోకి దిగిన త‌ర్వాతే ఇలా జ‌రిగిందంటూ త‌మ‌కు అనుకూలంగా దీన్ని ప్ర‌చారం చేసుకున్నారు.కానీ కేసీఆర్ చేసిన రాజ‌కీయంలో ఉన్న అస‌లు కోణం మాత్రం ఇప్ప‌ట్లో బయ‌ట‌కు రాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube