జగన్ పథకాల పై జనాల అభిప్రాయం ఇలా ఉందా ? 

ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి.2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ మొదటి రోజు నుంచి సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.ఎన్నో సంచలన పథకాలకు జగన్ రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు.ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంక్షేమ పథకాలు అమలు సాధ్యమేనా.అనే సందేహం జనాల్లో ఉన్న సమయంలోనే జగన్  వాటిని కొనసాగిస్తూనే , మరికొన్ని కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఉండడం,  ప్రజల ఖాతాలోకి నేరుగా సొమ్ములు జమ చేస్తూ ఉండడం ఇవన్నీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.జగన్ సంక్షేమ పథకాల ప్రవాహం ఇప్పట్లో ఆగేది కాదు .
       2024 ఎన్నికల వరకు జగన్ ఇదే విధంగా పథకాల పేరుతో లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే.అయితే అసలు జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల విషయంలో జనాల అభిప్రాయం ఏ విధంగా ఉంది ? పథకాలు అందుకున్న వారిలో అసంతృప్తి ఎంతవరకు ఉంది అనే విషయంపై తాజాగా ప్రశాంత్ కిషోర్ టీమ్ తో జగన్ సర్వే చేయించినట్లు సమాచారం.ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయట.సంక్షేమ పథకాల పేరుతో జగన్ వృధాగా ఖర్చు పెడుతున్నారని,  అయినా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని , కనీసం రోడ్ల మరమ్మతులకు కూడా ప్రభుత్వం సొమ్ములు వెచ్చించలేని పరిస్థితుల్లో ఉందని, అభివృద్ధి పరంగా రాష్ట్రం బాగా వెనుకబాటుకు గురైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.
     

 This Is The Public Opinion On The Welfare Schemes Being Implemented In Ap Ap Cm-TeluguStop.com

ఈ అభిప్రాయాలు సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రజల్లోనూ వ్యక్తమవుతూ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోందట.ఈ వ్యవహారం ఇలా ఉంటే కేంద్ర అధికార పార్టీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంది.కేంద్రం ప్రవేశపెట్టిన కొన్ని కొన్ని పథకాలను ఏపీ ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేస్తోందని,  కనీసం ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కూడా  వేయడం లేదని బీజేపీ విమర్శలు చేస్తోంది.ఏపీ ప్రభుత్వం లక్షల కోట్లు సంక్షేమ పథకాల పేరుతో ఖర్చు పెడుతున్న, ఆ పథకాలు అందుకుంటున్న వారిలో సంతృప్తి కొంత వరకు మాత్రమే ఉంది.

మిగిలిన వర్గాల్లో దీనిపై వ్యతిరేకత ఎక్కువ వ్యక్తమవుతోంది.సంక్షేమ పథకాల పేరుతో మొత్తం నిధులన్నీ వాటికి ఖర్చు పెడుతూ , మిగిలిన రంగాలను వెనకబడేలా చేశారని , రోడ్లు అస్తవ్యస్తమైన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఏపీలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చోటు చేసుకోలేదని దీనంతటికి కారణం సంక్షేమ పథకాల పేరుతో వృధాగా సొమ్ములు ఖర్చుపెట్టడమే కారణం అనే అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో నెలకొందట.

 పీకే టీమ్ సర్వేలోనూ ఇదే విషయం బయటపడడంతో జగన్ సైతం ఆలోచనలో పడ్డారట. 

.

This Is The Public Opinion On The Welfare Schemes Being Implemented In Ap Ap Cm Jagan

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube