అమెరికాలో భారతీయల సత్తాకి..ఇదో నిదర్శనం     2018-07-10   03:11:06  IST  Bhanu C

ఏ దేశం వెళ్ళినా..ఎక్కడ ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని కలిగి ఉంటారు ఇండియన్స్ ప్రతిభ.. తెలివితేటలు ఉంటే చాలు అడవులలో సైతం బ్రతికేయగల గుండెనిబ్బరం ఉన్న ఏకైక వ్యక్తి ఒక ఇండియన్ అంటారు..అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఎన్నో దేశాల నుంచీ ప్రజలు వలసలు వెళ్తూ ఉంటారు చాలా మంది ఉద్యోగాలు మరి కొంతమంది చదువులు వ్యాపారాలు నిమ్మిత్తం అమెరికా వెళ్తారు అయితే అమెరికాలో సింహబాగం రెండ కార్పెట్ పరిచేది మాత్రం ఒక్క ఇండియన్స్ కి మాత్రమే ఈ విషయం ఎవరో చెప్పింది కాదు సాక్షాత్తు ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన నిజాలు వివరాలలోకి వెళ్తే..

ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలపై ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన తాజా నివేదిక అమెరికాలో భారతీయుల ముద్రను మరోమారు చాటిచెప్పింది. ఎనిమిదేళ్ల కాలంలో లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా 12 లక్షల మంది నైపుణ్యవంతులైన ఇండియన్లు అమెరికాకు ఒక్క ఏడాదిలోనే పయనమయ్యారని తేలింది…ఈ లక్కలతో ఒక్క సారిగా షాక్ తిన్నారు నిపుణులు..

అయితే భారతీయులు తరువాత ఈ లిస్టు లో అధికంగా ఉన్నది మాత్రం ఫైలిఫిన్స్ అని తేలింది….2010 సంవత్సరంలోనే 3లక్షల మంది మంది పిలిప్పిన్స్ దేశస్తులు కెనడాకు వెళ్లారు. అదే ఏడాదికి మనోళ్ల వలసలు పది లక్షలు ఉండటం గమనార్హం. ఈ వలసల జోరు ఇలా సాగుతోందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది…అయితే ఈ మధ్యకాలంలో విసాలపై వచ్చిన నిభంధాలు కారణంగా కొంతమంది వలసదారులు తగ్గారని అంటున్నారు అధికారులు.