IPL 22: చరిత్ర సృష్టించారు, ఎలిమినేటర్ స్థాయినుండి విజేతగా మారిన ఏకైక జట్టు ఇదే!

IPL 22 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్ ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది.గ్రూప్ దశలో మొత్తంగా 70 మ్యాచ్‌లు ముగిశాయి, అలాగే ప్లేఆఫ్ కోసం 4 జట్లు సిద్ధమయ్యాయి.

 This Is The Only Team That Has Gone From Eliminator Level To Winner-TeluguStop.com

ఇందులో GT (గుజరాత్ టైటాన్స్) 1st స్థానంలో నిలవగా, RR (రాజస్థాన్ రాయల్స్) 2వ స్థానంలో నిలిచి, ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి.ఇక 3వ స్థానంలో LSG (లక్నో సూపర్ జెయింట్స్), 4వ స్థానంలో RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఉన్నాయి.టాప్-2 జట్లకు ఫైనల్‌కు చేరుకోవడానికి 2 అవకాశాలు లభిస్తాయి.మిగిలిన 2 జట్లు 3 మ్యాచ్‌లు గెలిచి లిస్టులో చేరవలసి ఉంటుంది.

ఈ పరిస్థితిలో ఎలిమినేటర్ ఆడుతున్న జట్టు టైటిల్ గెలవడం ఒకింత కష్టతరమనే చెప్పుకోవాలి.IPL చరిత్రలో ఎలిమినేటర్ ఆడుతున్న జట్టు టైటిల్‌ను గెలిచిన సందర్భం ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే నమోదైంది.2016 సీజన్‌లో SRH (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఈ ఘనతను సాధించింది.అప్పుడు జట్టు కెప్టెన్సీ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేతిలో ఉంది.2016 సీజన్‌లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.ఎలిమినేటర్ మ్యాచ్‌లో KKR (కోల్‌కతా నైట్ రైడర్స్)పై ఈ జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దీంతో క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్‌తో తలపడగా, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Telugu Eliminate, Latest-Latest News - Telugu

ఇలాంటి గడ్డు పరిస్థితిలో, టైటిల్ కోసం ఫైనల్‌లో RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) పోటీపడగా, ఇందులో సన్‌రైజర్స్ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచింది.IPL 2022 సీజన్‌లో టాప్-2 జట్లైన గుజరాత్, రాజస్థాన్ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ ఈరోజు అనగా మే 24న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

ఓడిన జట్టుకు మరో అవకాశం దక్కుతుంది.ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

మే 25న కోల్‌కతాలోనే లక్నో, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube