Weak Password : ప్రపంచంలో ఎక్కువ మంది పెట్టుకున్న పాస్‌వర్డ్ ఇదే

డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార భద్రత కోసం అందరూ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తుంటారు.ఫోన్ లాక్ కోసం, ఈ-మెయిల్ కోసం, యూపీఐ పేమెంట్ యాప్‌ల కోసం ఇలా చాలా విషయాలలో పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటుంటారు.

 This Is The Most Used Password In The World , Weak Password, Technology News ,la-TeluguStop.com

వాటిని చాలా సీక్రెట్‌గా ఉంచామనుకుంటున్నారు.అయితే పొడవైన పాస్‌వర్డ్‌లను పెట్టుకునే బదులు చాలా చిన్నవి పెట్టుకుంటారు.

పొడవైనవి అయితే మర్చిపోతామనే భయం చాలా మందిలో ఉంటుంది.అయితే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తమ పాస్‌వర్డ్‌లుగా ఒకే పదాన్ని ఉపయోగిస్తున్నారని తేలింది.

దీనికి సంబంధించిన కీలక విషయాలిలా ఉన్నాయి.

Telugu Latest, Password, Ups, Weak, Weak Password-Latest News - Telugu

వ్యక్తిగత సమాచారం లీక్ అవడానికి కారణం మనం పెట్టుకునే బలహీనమైన పాస్‌వర్డ్‌లే.వీటి వల్లే హ్యాకర్లు మన పాస్‌వర్డ్‌లను ఎక్కువగా బ్రేక్ చేస్తున్నారు.ఫలితంగా మన బ్యాంకు ఖాతాలలో డబ్బులు మాయం చేయడం నుంచి, మన వ్యక్తిగత సమాచారం దొంగిలించడం వరకు ఎన్నో అనర్ధాలు సంభవిస్తున్నాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌గా PASSWORD పదం నిలిచింది.పాస్‌వర్డ్‌గా పాస్‌వర్డ్ పదాన్నే ఎక్కువ మంది పెట్టుకుంటున్నారని తేలింది.దీనిని మించి ‘123456’ని అత్యధికంగా పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారు.సాఫ్ట్‌వేర్-ఎ-సర్వీస్ ప్రొవైడర్ NordPass ప్రచురించిన ఫలితాలలో ఆ పాస్‌వర్డ్ సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల జాబితాలో ఈ రెండు అగ్రస్థానంలో ఉన్నాయి.

స్వతంత్ర సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుల సహకారంతో నాలుగు టెరాబైట్ డేటాబేస్‌ను మూల్యాంకనం చేయడంతో, కంపెనీ 123456 అనేది ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌గా గుర్తించింది, దాని వినియోగానికి 100 మిలియన్లకు పైగా ఉదాహరణలు ఉన్నాయి.ఇది ఆస్ట్రేలియాలో కూడా ఎక్కువగా ఉపయోగించబడుతుంది.3,00,000 లక్షల మంది దీనినే ఉపయోగిస్తున్నారని తేలింది.ఇలాంటి ఈ పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయడానికి హ్యాకర్‌కు సెకను కంటే తక్కువ సమయం పడుతుంది.

మనకు 16 లేదా 32 అక్షరాల పొడవు ఉన్న పాస్‌వర్డ్ ఉంటే, దాన్ని టైప్ చేయడానికి కొంత సమయం పడుతుంది.అయితే చాలా మంది సులువుగా ఉండే పాస్‌వర్డ్‌లను ఎంచుకుంటుంటారు.

దాని వల్ల హ్యాకర్ల బారిన పడుతున్నారని సైబర నిపుణులు చెబుతున్నారు.కాబట్టి పొడవైన, ఇతరులు హ్యాకింగ్ చేయలేని పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube