ఇది ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన మేక‌పోతు.. ధ‌ర తెలిస్తే

This Is The Most Expensive Goat In The World If You Know The Price

ఒక‌ప్ప‌డు పురుషులందు పుణ్య ప‌రుషులు వేరయా అని చెప్పుకునే వాళ్లం.అయితే ఇప్పుడు మాత్రం మేక‌లందు ఈ మేక వేరయా అని చెప్పుకోవాలేమో అనిపిస్తుంది.

 This Is The Most Expensive Goat In The World If You Know The Price-TeluguStop.com

ఎందుకంటే దాని ప్ర‌త్యేక‌త‌లు అలా ఉన్నాయి మ‌రీ.పైగా అది ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన మేక అంట‌.

ఖ‌రీదైన మేక అంటే ఏ ప‌ది వేలో ఇర‌వై వేలో అనుకుంటే పొర‌పాటే.ఇలా అనుకోవ‌డానికి కూడా కార‌ణాలు ఉన్నాయ‌నుకోండి.

 This Is The Most Expensive Goat In The World If You Know The Price-ఇది ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన మేక‌పోతు.. ధ‌ర తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే మ‌న దేశంలో ఒక మేక‌కు ఐదు నుంచి ప‌దివేల మ‌ధ్య ఉంటుంది.కాబ‌ట్టి ఇంకా ఖ‌రీదు అంటే మ‌హా అయితే ఏ ఇర‌వై వేలు ఉంటుంది కావ‌చ్చు అనుకుంటున్నారు క‌దా.

అలా అయితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే.ఎందుకంటే ఇది ఏ ప‌దివేలో ఇర‌వై వేలో కాదండోయ్‌.

దీని రేటు తెలిస్తే గిర్రున త‌ల తిరుగుతుంది కావ‌చ్చు.ఎందుకంటే దీని రేటు అలా ఉంది మ‌రి.

ఆస్ట్రేలియా దేశానికి చెందిన‌టువంటి మర్రకేశ్‌ అనే మేక ఇప్పుడు అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా సెన్సేష‌న‌ల్ న్యూస్ అయిపోయింది .దీని ధ‌ర 21 వేల డాలర్లు.అంటే మ‌న దేశంలో దాదాపు రూ.15,64,983. ఏంటి అంతా అని ఆశ్చ‌ర్య‌పోకండి.

మీరు విన్న‌ది నిజ‌మే.అవునండి దాని రేటు అదేనంట‌.

రీసెంట్ గా అంత రేటు ప‌లికింద‌ని చెబుతున్నారు.

Telugu Dollars, Andrew Mosley, Australia, Australia Goat, Expensive Goat, Marrakesh, Wales, Worldscostliest-Latest News - Telugu

ఈ దేశంలోని పశ్చిమ న్యూ సౌత్ వేల్స్ సిటీలోని కోబార్‌లో దీన్ని అమ్మకానికి పెట్ట‌గా ఇలా రికార్డు ధ‌ర ప‌లికింద‌ని వారు చెబుతున్నారు.దీన్ని ఆండ్రూ మోస్లీ అనే అత‌ను అంత ధ‌ర పెట్టి కొన్నాడ‌ని తెలుస్తోంది.ఇది చూసేందుకు చాలా దృఢంగా, బ‌లిష్టంగా ఉంది.

అయితే దీనికి చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయ‌ని, ఇది చాలా అరుదైన జాతికి చెందిన‌ద‌ని తెలుస్తోంది.దీనికి పుట్టే పిల్ల‌లు అంతే బ‌లిష్టంగా మాంసం చాలా టేస్టీగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

అందుకే దాన్ని అంత రేటు పెట్టి కొంటున్నామ‌ని వివ‌రించారు కొనుగోలు దారుడు.

#Wales #Australia #Expensive Goat #Marrakesh #Dollars

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube