అది దుష్ట‌శ‌క్తుల ద్వీపం.. అక్క‌డికి వెళ్లాలంటే ఇదీ కండీష‌న్‌!

ఈ ద్వీపం స్కాట్లాండ్‌లో ఉంది.హృదయాకారంలో ఉండే ఈ ద్వీపం చాలా చిన్నది.

 This Is The Most Amazing Island In The World, Professor Dan Lee K,  Island, Univ-TeluguStop.com

అందుకే దీనిని మ్యాప్‌లో కనుగొనడం చాలా కష్టం.ఐన్‌హాలోనీ ఈ ద్వీపం గురించి అనేక రహస్య కథనాలు ప్రబలంగా వినిపిస్తాయి.

ఈ ద్వీపంలో దెయ్యాల‌తో సహా భూత శక్తులు నివసిస్తాయని నమ్ముతారు.ఈ కారణంగా ఈ ద్వీపాన్ని సంద‌ర్శించేందుకు అనుమ‌తులు ఉండ‌వు.

అక్క‌డున్న శక్తులు చాలా శక్తివంతమైనవ‌ని, ఒంటరిగా లేదా చిన్న గ్రూపుగా ద్వీపానికి వెళ్లడానికి ప్రయత్నించే ఎవరైనా తిరిగి రాలేది చెబుతుంటారు.ఈ ద్వీపానికి సంబంధించిన‌ నమ్మకాలు స్కాట్లాండ్‌లో చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఓర్క్నీ ప్రజలు వీటిని న‌మ్ముతారు.

ఎవరైనా ఈ ద్వీపంలోకి వెళ్ల‌డానికి ప్రయత్నిస్తే ఈ దుష్టశక్తులు వారిని గాలిలో అదృశ్యం చేస్తాయ‌ట‌.ఇది మాత్రమే కాదు ఈ ద్వీపంలో మత్స్యకన్యలు నివసిస్తున్నాయని కూడా చెబుతారు, ఇవి వేసవి కాలంలో మాత్రమే నీటి నుండి బయటకు వస్తాయ‌ట‌.

స్కాట్లాండ్‌లోని హైలాండ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాన్ లీ కే మాట్లాడుతూ.ఈ ద్వీపంలో వేల సంవత్సరాల క్రితం ప్రజలు నివసించారని, అయితే 1851 సంవత్సరంలో ప్లేగు వ్యాధి ఇక్కడ వ్యాపించిందని, దీని కారణంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ద్వీపాన్ని విడిచిపెట్టారని చెప్పారు.ఇప్పుడు ఈ ద్వీపం పూర్తిగా ఎడారిగా మారింది.ఇప్పుడు ఇక్కడ అనేక పురాతన భవనాల శిథిలాలు క‌నిపిస్తాయి.

పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం, త‌వ్వకాల్లో ఇక్కడ అనేక రాతియుగం నాటి గోడలు కూడా క‌నిపించాయి.ఐన్‌హాలో ద్వీపం ఎప్పుడు ఏర్పడిందనే దాని గురించి స‌రైన సమాచారం లేదు.

ఈ ద్వీపం పరిశోధనకు నెల‌వుగా ఉంద‌ని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.దీనిపై పరిశోధనలు చేస్తే.

ఇలాంటి ఎన్నో చరిత్ర రహస్యాలు బయటపడి ఆశ్చర్యానికి గురిచేస్తాయ‌న్నారు.ఐన్‌హాలో వైపు పర్యాటకుల తాకిడిని చూసి, ఒక సొసైటీ ఒక అడుగు ముందుకు వేసింది.

ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఒక రోజు పర్యాటకులకు ఇక్క‌డికి అనుమ‌తినిస్తారు.ఈ సంద‌ర్భంగా ప‌ర్యాట‌కుల కోసం పూర్తి సన్నాహాలు చేస్తారు.

ఇక్క‌డి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, గ‌జ‌ ఈతగాళ్ల‌ను ఏర్పాటు చేస్తారు.ఏదైనా ప్రమాదం జరిగితే వీరు రక్ష‌ణ‌ను అందిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube