2022లో బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే..!

మరికొన్ని రోజుల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాము.ఈ క్రమంలో బ్యాంకు కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది బ్యాంకుల సెలవుల జాబితాను l విడుదల చేసింది.

 This Is The List Of Bank Holidays In 2022 2022 Year, Latest News, Bank Holidays,-TeluguStop.com

ఎవరయితే లావాదేవీల కోసం తరచూ బ్యాంకులకు వెళతారో వారు వచ్చే ఏడాది బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకొని వాటికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి .దేశంలోని అన్ని రీజియన్లలో సెలవుల (Bank Holidays) జాబితాను అధికారిక వెబ్‌సైట్‌ లో ఆర్‌బీఐ అప్డేట్ చేసింది.ఈ సెలవుల్లో పండుగలు, పర్వదినాలు ఇతర హాలిడేస్ కలిపే ఉన్నాయి.మరి 2022 లో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో, ఏఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో అనే వివరాలు తెలుసుకోండి.

కొత్త ఏడాది 2022 జనవరి 15 మకర సంక్రాంతి, జనవరి 26 రిపబ్లిక్ డే, మార్చి 1 మహా శివరాత్రి, మార్చి 18 హోళీ, ఏప్రిల్ 1 బ్యాంక్ అకౌంట్ల క్లోజింగ్ డే, ఏప్రిల్ 2 ఉగాది, ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే, మే 3 రంజాన్, బసవ జయంతి, అక్షయ తృతీయ, ఆగస్ట్ 9 మొహర్రం, ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 20 శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఆగస్ట్ 31వినాయక చవితి, అక్టోబర్ 5 దసరా, అక్టోబర్ 25న దీపావళి, నవంబర్ 8 గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి లలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.మొత్తంగా 2022 సంవత్సరంలో మొత్తం 17 సాధారణ సెలవులు వచ్చాయి.

ఇవే కాకుండా ప్రతీ ఆదివారం, ప్రతీ నెలలో వచ్చే రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలు ప్లాన్ చేసుకుంటే మంచిది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లో బ్యాంకు సెలవుల వివరాలు తెలుసుకోవడానికి https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేసిన తర్వాత రీజియన్ ఆఫీస్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుని, ఆ తర్వాత నెల సెలెక్ట్ చేసుకుంటే ఆ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో కనిపిస్తుంది.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికి కస్టమర్లు మాత్రం నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, యూపీఐ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

List of Bank Holidays in #2022TeluguCalendar

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube