'పుష్ప' సినిమాకు లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే ?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప.ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.

 Latest Buzz On Pushpa Movie Release Date Update, Pushpa, Allu Arjun, Sukumar, Pu-TeluguStop.com

అల్లు అర్జున్ కూడా మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో ఎర్ర చందనం స్మగ్లర్ గా లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు.

బన్నీ మాస్ లుక్ లో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈమె గిరిజన యువతీ పాత్రలో కనిపించ బోతుంది.ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.

మొదటి భాగం ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

Telugu Allu Arjun, Mythri Makers, Pushpa, Pushparaj, Sukumar-Movie

ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్‘ పేరుతొ మన ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు.అయితే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనీ ఎప్పటి నుండో అనుకుంటున్నారు.అయితే క్రిస్మస్ కు కూడా వస్తుందో రాదో అని అందరు అనుకుంటున్నారు.

Telugu Allu Arjun, Mythri Makers, Pushpa, Pushparaj, Sukumar-Movie

క్రిస్మస్ కు కేజిఎఫ్ సినిమా కూడా రాబోతుందని తెలిసి పోటీ బాగా ఉంటుందని అనుకున్నారు.అయితే కేజిఎఫ్ సినిమా రిలీజ్ వాయిదా పడడంతో ఇప్పుడు పుష్ప సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది.ఈ నేపథ్యంలో పుష్ప రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ఈ సినిమాను డిసెంబర్ 24 న విడుదల చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది.ఎలాగూ క్రిస్మస్ కు ఈ సినిమా వస్తుందని ముందు నుండి రూమర్ ఉంది కాబట్టి డిసెంబర్ 24 నే ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో టాక్ వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube