టీడీపీ బాగుప‌డాలంటే చివ‌రి అస్త్రం అదేనా ?

తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్‌హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూశాక ఇప్పుడు అంద‌రినోటా వినిపిస్తోన్న మాట ఒక్క‌టే.ఏపీలోనే కాదు తెలంగాణ‌లోనూ తెలుగుదేశం పార్టీ బాగుప‌డాల‌న్నా.

 This Is The Last Political  Plan To Make Tdp Grow, Ap, Telugu States, Telangana,-TeluguStop.com

బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాల‌న్నా జూనియ‌ర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల‌న్న‌దే వినిపిస్తోంది.మూడున్న‌ర ద‌శాబ్దాలుగా తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిన తెలుగుదేశం ఈ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్‌లో చివ‌ర‌కు ఆంధ్రా సెటిల‌ర్స్ ఓట‌ర్లే కాదు, క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట‌ర్ల మ‌ద్ద‌తు కూడా పొంద‌లేక‌పోయింది.104 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ క‌నీసం ఒక్క చోట గెలుపు కాదు క‌దా డిపాజిట్ కూదా దక్కించుకోలేదు.దీనిని బ‌ట్టి ఆ పార్టీ ప‌రిస్థితి ఎంత దారుణంగా దిగాజ‌రిందో తెలుస్తోంది.

2014 ఎన్నిక‌ల‌తో పాటు 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ న‌గ‌రంలో టీడీపీ స‌త్తా చాటింది.2014లో బీజేపీతో క‌లిసి పోటీ చేసి స‌త్తా చాటిన టీడీపీ 2018లో కాంగ్రెస్‌తో క‌లిసి పోటీ చేసి ఒక్క సీటు గెల‌వ‌క‌పోయినా భారీ స్థాయిలో ఓట్లు రాబ‌ట్టింది.తెలంగాణలో ఎంతో కేడర్ ఉన్న పార్టీగా పేరొందిన తెలుగుదేశం ఇంత ఘోరపరాజయాన్ని చవిచూడడం పార్టీ అభిమానులకు బాధ కలిగిస్తూనే ఉంది.పార్టీలో బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోయినా కేడ‌ర్ మాత్రం స్ట్రాంగ్‌గానే ఉంది.

ఇప్ప‌ట‌కీ అక్క‌డ టీడీపీని, ఎన్టీఆర్‌ను అభిమానించే వారి సంఖ్య ఎక్కువే.

Telugu Andhra Pradesh, Chandra Babu, Latest, Ntr Fans, Stratagey, Tdp Fans, Tdp,

చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోలేదు.పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవ‌డానికి కేవ‌లం నాయ‌క‌త్వ లోప‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది.ఎల్‌.

ర‌మ‌ణ‌తో పాటు ఇక్క‌డ డ‌మ్మీ నాయ‌కుల‌ను ఎంత మందిని పెట్టినా టీడీపీ నిల‌బ‌డే ప‌రిస్థితి లేదు.అటు ఏపీలోనూ పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాలంటే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి తీసుకు రావ‌డంతో పాటు పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు అంద‌రి నోట వినిపించే మాట జూనియ‌ర్ ఎన్టీఆరే.పార్టీని బ‌తికించాలంటే చంద్ర‌బాబు త‌న త‌న‌యుడు లోకేష్‌తో పాటు ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోతే పార్టీ తెలంగాణ‌లో మునిగిన‌ట్టే ఏపీలో కూడా మునిగిపోతుంద‌నే ఎక్కువ మంది అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రి చంద్ర‌బాబు వీరి మాట‌లు వింటారో ?  లేదో ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube