ప్ర‌పంచంలో లాంగ్ హెయిర్ క‌లిగిన అమ్మాయి ఈమెనే.. వ‌ర‌ల్డ్ రికార్డ్‌

ఈ సృష్టిలో చాలా ర‌కాల మ‌నుషులు ఉంటారు.ఒక్కొక్క‌రిలో ఒక్కో ర‌క‌మైన విచిత్ర‌మైన ల‌క్ష‌ణం ఉంటుంది.

 This Is The Girl With The Longest Hair In The World .. World Record,  World Reco-TeluguStop.com

అందుకే వారు అంద‌రికంటే స్పెష‌ల్ గా నిలుస్తుంటారు.ఇక ఇలాంటి స్పెష‌ల్ ట్యాలెంట్ ఉన్న వారికోసం లిమ్కా బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ లాంటివి కూడా ఉన్నాయి.

వారు చేసే ఫీట్‌ను ఇంకెవ‌రూ సాధించ‌లేక‌పోతే ఆ రికార్డ్‌ను వారి పేరు మీద న‌మోదు చేస్తుంటారు ఇలాంటి వారు.అయితే ప్ర‌తి మ‌నిషికి జుట్టు అనేది ఎంత ముఖ్య‌మో అంద‌రికీ తెలిసిందే.

జుట్టు ఉంటేనే అందం అన్నంత‌గా ఇప్పుడు మారిపోయింది.చాలామంది ఇలా జుట్టును పెంచుకునేందుకు చాలా ఖ‌ర్చు చేస్తుంటారు.

ఇక జుట్టు లేని వారి బాధ వ‌ర్ణ‌నాతీతం.ఇక ఇప్ప‌టి త‌రం కోసం కొన్ని కంపెనీలు అయితే జుట్టు కోస‌మే ప్ర‌త్యేక బ్రాండ్‌ల‌ను కూడా తీసుకొస్తున్నాయి.వీటికి చాలా డిమాండ్ కూడా ఉంటోంది.ఈ జుట్టుకు సంబంధించిన ఉత్ప‌త్తుల‌కు పెద్ద ఎత్తున బిజినెస్ జ‌రుగుతోంది.

అయితే ఇప్పుడు ఓ అమ్మాయి జుట్టు గురించి తెలిస్తే నిజంగానే షాక్ అయిపోతుంటారు.ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు ప్ర‌పంచంలోనే లాంగెస్ట్ హెయిర్ కలిగిన అమ్మాయిగా రికార్డు సృష్టించింది.

అది కూడా 2020 నుంచి 2022 వ‌ర‌కు లాంగ్ హెయిర్ క‌లిగిన అమ్మాయిగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెల‌కొల్పింది.

ఇక ఇటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించుకుందంటే ఇప్ప‌టికే ఆమె ఇండియా అమ్మాయి అని అర్థం అయిపోయి ఉంటుంది క‌దా.అవును ఆ అమ్మాయి మహారాష్ట్రలోని థానేలో నివ‌సిస్తోంది.ఆమె పేరు ఆకాంక్ష యాదవ్.ఈమెకు దాదాపుగా 9 అడుగుల 10.5 అంగుళాలు పొడ‌వైన జుట్టు ఉంది.ఈ జుట్టే ఆమెకు సెల‌బ్రిటీ మోదా తెచ్చిపెట్టింది.ఈమె జుట్టుకు చాలామంది ఫ్యాన్ష్ ఉన్నారు.ఇప్పుడు ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు ద‌క్కిందంటే ఆమెకు ఎంత పెద్ద జుట్టు ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.ఇప్పుడు కాదు 2019 నుంచి ఆమెదే పొడ‌వైన జుట్టుగా ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube