తండ్రి అంటే ఇతడే.. కూతురు కోసం ఎలాంటి వెహికల్ తయారు చేసాడో చూడండి!

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను సంతోషపెట్టడానికి ఎంతటి పని అయినా చేస్తారు.ముఖ్యంగా తండ్రులు తమ బిడ్డలను ఖుషి చేసేందుకు చాలా కష్టపడతారు.

 This Is The Father . See What Kind Of Vehicle He Made For The Daughter Father, D-TeluguStop.com

కూతుర్ల సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు.తాజాగా తండ్రి ప్రేమ మరొకసారి నిరూపితమయింది.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోని ఫ్యూబిటీ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్నారి కూలింగ్ గ్లాసెస్ ధరించి ఉండటం గమనించవచ్చు.ఆపై ఈ బాలిక అవతార్ సినిమాలో కనిపించిన వాహనం లాంటి ఒక పెట్టెలో కూర్చోడం చూడొచ్చు.

ఆ చిన్నారి అలా కూర్చోగానే ఆ పెట్టెలోని ముందు భాగం రోబో లాగా ఒక షీల్డ్ ఏర్పాటు చేసింది.

అనంతరం అదంతట అదే తిరుగుతూ చిన్నారికి ఒక మంచి రైడ్ ఇచ్చింది.

అయితే ఈ పెట్టె దానంతటదే తిరగలేదు.దీనిలోపల ఆ చిన్నారి తండ్రి ఉన్నాడు.

అతడే ఈ రోబో లాంటి వాహనాలు తిప్పుతూ చిన్నారికి ఒక మంచి అనుభూతిని కలిగించాడు.ఆ తర్వాత నెమ్మదిగా ఆ అమ్మాయిని కిందకి దించాడు.

అలా ఆ చిన్నారి కోరికను తీర్చి తన తండ్రి హృదయాన్ని చాటుకున్నాడు.ఈ వీడియోని తల్లి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇప్పుడు అది కాస్తా వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజనులు ఈ పాప డాడీ ని బాగా పొగుడుతున్నారు.

ఇతడే అసలైన తండ్రి అంటే, హ్యాట్సాఫ్ టు యు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube