ఏపీలో కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న డేట్ ఇదే… ఎన్ని జిల్లాలో తెలుసా..!  

this is the date of new districts reaveled in ap, Ap 26 New Distict, Jagan Governament, Ap Deputy Speaker Kona Raghupathi, Chandrababu Naidu, Mla\'s, Mp,s, Village Volunters, Jagan In Elections Campaign - Telugu Ap 26 New Distict, Ap Deputy Speaker Kona Raghupathi, Chandrababu Naidu, Jagan Governament, Jagan In Elections Campaign, Mlas, Mp, This Is The Date Of New Districts Reaveled In Ap, Village Volunters

ఏపీలో కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న ఓ కొలిక్కి వ‌స్తోంది.కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ ఏర్పాటు చేసిన క‌స‌ర‌త్తు ముగింపు ద‌శ‌కు చేరుకుంద‌నే చెప్పాలి.

TeluguStop.com - This Is The Date Of New Districts Reaveled In Ap Do You Know How Many Districts

జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారాంలోనే ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాన‌ని హామీ ఇచ్చారు.అయితే గ‌తేడాది సంక్రాంతికే ఈ జిల్లాల పున‌ర్విభ‌న పూర్త‌వుతుంద‌ని అనుకున్నారు.

జ‌గ‌న్ గ్రామ స‌చివాల‌యాలు, వలంటీర్ల నియామ‌కాల్లో బిజీగా ఉండ‌డంతో ఈ ప్ర‌క్రియ కాస్త ఆల‌స్యం అయ్యింది.ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగానే పార్ల‌మెంట‌రీ జిల్లాల వారీగానే పార్టీని సంస్థాగ‌తంగా ప‌టిష్టం చేసుకుంటూ వ‌స్తున్నారు.

TeluguStop.com - ఏపీలో కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న డేట్ ఇదే… ఎన్ని జిల్లాలో తెలుసా..-Political-Telugu Tollywood Photo Image

ఇప్పుడు జ‌గ‌న్ బాట‌లోనే చంద్ర‌బాబు సైతం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గా వారీగానే పార్టీ అధ్య‌క్షులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మించుకుంటూ వ‌స్తున్నారు.ఇక ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ఒక్క‌టే మిగిలి ఉంది.

అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు డేట్ కూడా ఫిక్స‌య్యింది.వ‌చ్చే జ‌న‌వ‌రి 26న గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న ఉంటుంది.

ఈ విష‌యాన్ని ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి స్వ‌యంగా వెల్ల‌డించారు.ర‌ఘుప‌తి  ఈ విష‌యాన్ని తాజాగా గుంటూరులో స్ప‌ష్టం చేశారు.

అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో త‌మ రాజ‌కీయ ప్రాబ‌ల్యానికి గండి ప‌డుతుంద‌ని భావిస్తున్న కొంద‌రు మంత్రులు, వైసీపీ సీనియ‌ర్లు రుస‌రుస లాడుతున్నారు.అయితే జ‌గ‌న్ కూడా ఇదే అంశంపై వారితో కొత్త జిల్లాల ఏర్పాటులో ఎలాంటి జోక్యం చేసుకోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశార‌ట‌.

దీంతో ఈ వ్యవహారం వైసీపీ సర్కార్ లో సైలెంట్ గా సాగుతోంది.ఇక ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక జిల్లా చొప్పున ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను 25 జిల్లాలుగా విభ‌జ‌న చేస్తారు.

ఇక శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల‌ను క‌లుపుకుని పార్వ‌తీపురం కేంద్రంగా మ‌రో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.ఈ లెక్క‌న మొత్తం 26 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

జిల్లాల సరిహద్దులతోపాటు ఇతర అంశాలపై అధికారుల‌దే తుది నిర్ణ‌యం కానుంది.

#MLAs #ApDeputy #JaganIn #ThisIs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

This Is The Date Of New Districts Reaveled In Ap Do You Know How Many Districts Related Telugu News,Photos/Pics,Images..