సోషల్ మీడియాలో నెగిటివిటీ సమంతకు శాపమా.. ఆ కామెంట్ల వల్లే కలెక్షన్లు రావట్లేదా?

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ఏ మాయ చేశావె సినిమాతో ప్రేక్షకులను మాయ చేసి ఆ సినిమా నుంచి శాకుంతలం( Shaakuntalam ) సినిమా వరకు అంతకంతకూ ఎదుగుతూ వచ్చారు.

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోయిన్ గా ఈ బ్యూటీ పేరు తెచ్చుకోవడంతో పాటు ఒకరిద్దరు మినహా అందరు స్టార్ హీరోలతో కలిసి ఆమె నటించారు.

కెరీర్ పరంగా వరుసగా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే చైతన్య సమంత పెళ్లి చేసుకున్నారు.చైతన్య( Naga Chaitanya ) సమంత పెళ్లి జరగడానికి ఒక మినీ యుద్ధమే జరిగిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

అక్కినేని ఫ్యామిలీ మొదట ఈ పెళ్లికి ఒప్పుకోలేదని అయితే నాగచైతన్య ఎంతో కష్టపడి పెళ్లికి ఒప్పించారని సమాచారం.అయితే ఈ ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారినా సమంత, నాగచైతన్య మూడేళ్లు మాత్రమే వివాహ బంధంలో కలిసి ఉన్నారు.

అయితే పెళ్లికి ముందు సమంత సక్సెస్ సాధించడంలో సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉంది.

Advertisement

అయితే పెళ్లి తర్వాత సమంతకు సోషల్ మీడియా శాపంగా మారింది.సమంత గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తే ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు వినిపించేవి.అయితే అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం, అభిమానుల సపోర్ట్ ఉండటం వల్ల ఆ సమయంలో సమంత సినిమాల కలెక్షన్లపై పెద్దగా ప్రభావం పడలేదు.

అయితే చైసామ్ ఎప్పుడైతే విడిపోయారో విడాకులకు సంబంధించి సామ్ దే తప్పనేలా ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

విడాకుల తర్వాత సమంత మెయిన్ రోల్ లో తెరకెక్కిన సినిమాలు మరీ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు.యశోద, శాకుంతలం ప్రమోషన్ల సమయంలో సమంత తన ఆరోగ్య సమస్యలను బయటపెట్టడంపై కూడా విమర్శలు వచ్చాయి.సమంతకు గతంతో పోల్చి చూస్తే క్రేజ్, పాపులారిటీ తగ్గింది.

శాకుంతలం సినిమాకు సమంత రెమ్యునరేషన్ స్థాయిలో కూడా కలెక్షన్లు రాలేదు.సమంత సోషల్ మీడియా పోస్ట్ లకు నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

నెగిటివిటీ తగ్గించుకునే దిశగా సమంత అడుగులు వేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు