Nani Ante Sundaraniki : ఆ ఒక్క తప్పే నాని కెరీర్ కు శాపమైందా.. వరుస ఫ్లాపుల వెనుక కారణాలివేనా?

టాలీవుడ్ హీరోలలో పక్కింటి అబ్బాయి అనే ట్యాగ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే హీరో ఎవరనే ప్రశ్నకు నాని పేరు సమాధానంగా వినిపిస్తుంది.అలాంటి నాని ప్రస్తుతం హీరోగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగించడంలో విఫలమవుతున్నారు.

 This Is The Curse For Hero Nani Details Here Goes Viral ,nani , Tollywood, Dasa-TeluguStop.com

ఈ మధ్య కాలంలో నాని హీరోగా నటించి బ్రేక్ ఈవెన్ అయిన సినిమాల సంఖ్య ఎంతనే ప్రశ్నకు చాలా తక్కువ అనే సమాధానం వినిపిస్తుంది.వీ, టక్ జగదీష్ శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు థియేటర్లు, ఓటీటీలలో ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంపిక చేసుకున్న నాని ప్రస్తుతం అటు మాస్ ప్రేక్షకులు ఇటు క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలను ఎంచుకుంటున్నారు.కమర్షియల్ అంశాలకు నాని ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కథ, కథనంలను గాలికొదిలేస్తున్నారు.

ఈ రీజన్ వల్లే నాని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కావడానికి బదులుగా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంటున్నాయి.వరుస ఫ్లాపుల నేపథ్యంలో నాని ఆశలన్నీ దసరా సినిమాపైనే ఉన్నాయి.

ఈ సినిమా అయినా నాని నమ్మకాన్ని నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఈ సినిమాకు కొత్త దర్శకుడు డైరెక్టర్ కావడంతో నాని అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో ఒకింత టెన్షన్ పడుతున్నారు.

Telugu @adivisesh, Dasara, Meet Cute, Nani, Tollywood-Movie

నాని పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా నిర్మాతగా కూడా నాని వరుస సక్సెస్ లను సొంతం చేసుకుంటూ ఉండటంతో ఆయన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా నాని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.నాని రేంజ్ మరింత పెరగాలని పాన్ ఇండియా హీరోగా నాని గుర్తింపును సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube