Pawan Kalyan Prabhas : ప్రభాస్, పవన్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఉన్న పోలిక ఏంటో మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టైర్1 హీరోలలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ ఉన్నారు.అయితే ఈ హీరోలలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది.

 This Is The Common Point Between Star Heroes Details Here Goes Viral ,  Pawan Ka-TeluguStop.com

ఈ హీరోలు స్టేజ్ లపై, ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు.అయితే ఈ హీరోలు తక్కువగా మాట్లాడినా తమ ప్రవర్తనతో, హుందాతనంతో, ప్రతిభతో అభిమానులకు దగ్గరయ్యారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్లలో ఏదైనా స్పీచ్ ఇవ్వాలంటే వీలైనంత త్వరగా స్పీచ్ ముగించడానికి ఇష్టపడేవారు.రీల్ లైఫ్ లో స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

అయితే గతంతో పోలిస్తే పవన్ లో సిగ్గు, బిడియం తగ్గాయి.పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు అవసరమైతే తప్ప మాట్లాడరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అయితే మహేష్ నోటి నుంచి వచ్చే పంచ్ లు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చాలామంది చెబుతారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటిట్యూడ్ కు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.రామ్ చరణ్ సైతం ఇంటర్వ్యూలలో అవసరమైన ప్రశ్నలకు మాత్రమే జవాబులు ఇస్తారు.

వీలైనంత తక్కువగా చరణ్ మాట్లాడతారు.

Telugu Bunny, Jr Ntr, Mahesh, Pawan Kalyan, Prabhas, Ram Charan-Movie

చిరంజీవి కొడుకు అయినా సింపుల్ గా ఉండటానికి చరణ్ ప్రాధాన్యత ఇస్తారు.మరో స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రభాస్ కూడా ఎక్కువగా మాట్లాడరు.

ఈ రీజన్ వల్లే ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి కూడా స్టార్ హీరో ప్రభాస్ ఎక్కువగా ఆసక్తి చూపరని టాక్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube