బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, బింబిసార మధ్య ఉన్న ఈ పోలికను మీరు గమనించారా?

ఈ మధ్య కాలంలో దర్శకులలో చాలామంది తమ సినిమాలను రెండు పార్టులుగా తెరకెక్కించాలని భావిస్తున్నారు.కొంతమంది దర్శకులు ఎక్కువ మొత్తంలో లాభాలు రావాలని సినిమాలను రెండు పార్టులుగా తెరకెక్కించాలని ప్రయత్నిస్తుంటే మరి కొందరు దర్శకులు మాత్రం కథకు అవసరం కావడంతో సినిమాలను రెండు పార్టులుగా తెరకెక్కించడానికి ఓకే చెబుతుండటం గమనార్హం.

 This Is The Common Feature Between Bimbisara Bahubali Kgf Pushpa Details, Bahuba-TeluguStop.com

ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాకముందే రెండు పార్టులుగా తమ సినిమాలు తెరకెక్కుతాయని చెప్పిన దర్శకులు సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాను మొదట ఒక భాగంగానే తెరకెక్కించాలని భావించినా కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది.

రెండేళ్ల గ్యాప్ లో బాహుబలి1, బాహుబలి2 విడుదల కాగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.ఆ తర్వాత కేజీఎఫ్ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రెండు పార్టులుగా తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు.

కేజీఎఫ్ పార్ట్1, కేజీఎఫ్ పార్ట్2 ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

Telugu Bahubali, Bimbisara, Kgf, Mallidi Vasisth, Prasanth Neel, Pushpa, Rajamou

ఈ సినిమా సక్సెస్ తో ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగుతోంది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప పార్ట్1 తో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని త్వరలో పార్ట్2 షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.మొదట ఒక పార్ట్ గా పుష్పను తెరకెక్కించాలని అనుకున్న సుకుమార్ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

Telugu Bahubali, Bimbisara, Kgf, Mallidi Vasisth, Prasanth Neel, Pushpa, Rajamou

మల్లిడి వశిష్ట సైతం బింబిసార సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు.బింబిసార పార్ట్1 సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో బింబిసార2 ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమాలన్నీ పార్ట్1 విడుదలై సక్సెస్ సాధించిన తర్వాతే పార్ట్2 తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం.బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, బింబిసార బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube