నాగచైతన్య ప్రేమ వార్తల్లో వాస్తవం ఇదే.. కోపంతో అలా చేశారంటూ?

గత కొన్ని నెలలుగా నాగచైతన్య మీడియాకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఆయనకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.గత కొన్నిరోజులుగా నాగచైతన్య శోభిత ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.

 This Is The Clarity About Nagachaitanya Love Rumours Details Here , Nagachaitany-TeluguStop.com

నాగచైతన్య వాస్తవానికి ఏ హీరోయిన్ తో రిలేషన్ లో లేదు.ఆయన ప్రేమలో ఉన్నట్టు ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా లేవు.

అయినప్పటికీ నాగచైతన్య పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.వైరల్ అయిన వార్తలపై చైతన్య సీరియస్ అయ్యారని తెలుస్తోంది.ఈ వార్తల విషయంలో చైతన్య చాలా అసహనంతో ఉన్నారని సమాచారం.మరో రెండు వారాల్లో చైతన్య నటించిన థాంక్యూ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య ఈ వార్తల గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వనున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి రూమర్లు ప్రచారంలోకి రాకుండా చైతన్య జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్ పైనే నాగచైతన్య ఫోకస్ పెట్టారు.వరుస సినిమాలతో చైతన్య బిజీగా ఉంటున్నారు.

వరుస సక్సెస్ లను సొంతం చేసుకుంటూ చైతన్య క్రేజ్ ను పెంచుకుంటున్నారు.థాంక్యూ సినిమాపై కూడా పాజిటివ్ గా అంచనాలు ఏర్పడ్డాయి.

Telugu Dil Raju, Nagachaitanya, Thankyou, Vikram Kumar, Rumours-Movie

థాంక్యూ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే నిర్మించారు.అయితే సినిమా బడ్జెట్ కు అనుగుణంగా థాంక్యూకు ప్రమోషన్స్ చేయడం లేదని చాలామంది భావిస్తున్నారు.దిల్ రాజు ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.విక్రమ్ కె కుమార్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.చైతన్య ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube