అన్నయ్యంటే ఇతడే.. వరద నీటిలో చెల్లెల్ని ఎలా కాపాడాడో చూడండి!

అన్నయ్య అంటే ఒక అభయం.అన్నయ్య అంటే ఒక రక్షకుడు.

 This Is The Brother. See How He Saved His Sister In The Flood Brothers Love ,vir-TeluguStop.com

ఇలా అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.తన తమ్ములను లేదా చెల్లెళ్లను అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.

తండ్రి తరవాత అంతటి బాధ్యతను మోసేది ఒక్క అన్నయ్యే అని చెప్పొచ్చు.ఈ విషయాన్ని మరోసారి నిరూపితం చేస్తోంది ఒక వీడియో.

ఇది అన్నాచెల్లెళ్ల మధ్య ఒక మధురమైన అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.అందుకే ఈ క్లిప్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ట్విట్టర్ అకౌంట్ @TheFigen షేర్ చేసిన ఈ వీడియో పదిహేను లక్షల వ్యూస్ సంపాదించింది.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే.

వరద నీటి ప్రవాహం ఒక రోడ్డు అంతటినీ నింపేయడం చూడవచ్చు.అటుపక్క స్కూల్ విద్యార్థులు ఉన్నారు.

ఓ చిన్నారి కూడా స్కూల్ యూనిఫామ్ లో ఉండటం గమనించవచ్చు.ఐతే కాస్త పెద్ద ఉన్న విద్యార్థులు ఈ వరద నీటిలో నడుస్తూ రోడ్డు దాటారు.

కానీ ఆ చిన్నారి మాత్రం ఆ వరద నీటిని చూసి భయపడింది.అందులోనుంచి వెళ్లలేకపోయింది.

అప్పుడే స్కూల్ నుంచి తన అన్నయ్య వచ్చాడు.అతడు కూడా చిన్నవాడే.

అయినా కూడా తన చెల్లికి నీళ్లు తగలకుండా రోడ్డు దాటించాలని అనుకున్నాడు.ఇందుకోసం అతడు మోకాళ్లపై కూర్చుని తన చెల్లెల్ని వీపుపై ఎక్కించుకున్నాడు.

ఆ తర్వాత ఏం భయం లేదు అంటూ చెల్లికి ధైర్యం చెబుతూ ఆ చిన్నారి బూట్లకు నీళ్లు కూడా తగలకుండా రోడ్డు దాటించాడు.ఈ దృశ్యాలను సమీపంలో ఉన్న ఒక వ్యక్తి వీడియో తీశారు.

ఇప్పుడు అది కాస్తా వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు అన్నయ్య ప్రేమ అంటే ఇలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.చెల్లెల్ని అన్నయ్య ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడని ట్విట్టర్ పేజీ క్యాప్షన్ జోడించింది.ఈ వీడియో చూసి మిగతా నెటిజన్లందరూ కూడా ఫిదా అవుతున్నారు.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube