అతి భారీ సిక్స్ ఇదే...వీడియో వైరల్!

సోషల్ మీడియా అనేది ఒక అద్భుత ప్రపంచం.అందులో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.

 This Is The Biggest Six Video Goes Viral-TeluguStop.com

చాలా మంది ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతుంటారు.ఇంకొందరు అయితే భయపడిపోతుంటారు.

ఇందులో పాపులర్ అవ్వాలనుకునేవారు రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల భయానక వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వదులుతుంటారు.వాటివల్ల చాలా మంది పాపులర్ అవ్వడమే కాదు.

 This Is The Biggest Six Video Goes Viral-అతి భారీ సిక్స్ ఇదే…వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సెలబ్రిటీలు కూడా అయ్యారు.తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ ల సిరీస్‌ లో జరుగుతోంది.అందులో భాగంగా సెకండ్ టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ 43 రన్స్ తేడాతో అపజయం పొందింది.

ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన ఇంగ్లండ్ ఆల్ అవుట్ అయిపోంది.దానికంటే ముందుగా 19.5 ఓవర్లలో 200 రన్స్ చేసింది.సిరీస్ లో మొదటి టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసిన లియామ్ లివింగ్‌ స్టోన్ ఈ మ్యాచ్‌ లో కూడా అబ్బురపరిచే బ్యాటింగ్ చేసి అందర్నీ ఉర్రూతలూగించాడు.

లివింగ్‌ స్టోన్ 23 బాల్స్ కి 38 రన్స్ చేశాడు.ఆ టైంలో మూడు అద్భుతమైన సిక్సులను అతడు కొట్టడం విశేషంగా చెప్పొచ్చు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ వేసిన ఓ బాల్ ని స్టేడియం బయటకు కొట్టడంతో అందరూ అవాక్కైపోయారు.ఈ సిక్సర్ ఇప్పుడు సూపర్ సిక్స్ అయ్యింది.

ప్రపంచంలోనే అతి పెద్ద సిక్స్‌ గా ఆ సిక్సర్ నమోదైందని వెల్లడించింది.లీడ్స్‌ లోని హెడింగ్లే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ 122 మీటర్ల కంటే పొడవైన అతి భారీ సిక్సును బాదాడు.

ఈ సిక్సర్‌ స్టేడియాన్ని దాటేసి పక్కనే ఉన్న రగ్బీ పిచ్‌ పై పడటంతో అందరూ ఆశ్చర్యపోయారు.బాల్ కనిపించకుండా పోవడంతో ఆ సిక్స్ ప్రపంచంలోనే అతి భారీ సిక్స్ గా రికార్డు నమోదు చేశారు.

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఈ సిక్స్‌ కు సంబంధించినటువంటి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇకెందుకు ఆలస్యం అతి భారీ సిక్స్ ను మీరు కూడా చూసేయండి.

#Sports Updates #Viral Video #PAK Vs ENG #Social Media #Lime Livingston

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు