Phoenix Citadel Mall Madhya Pradesh : ఇండియాలో అతి పెద్ద మాల్ ఇదే .. 19 ఎకరాల మాల్ గురించి మీకు తెలుసా ?

చాలా మందికి మాల్స్ కు వెళ్లడం అంటే భలే సరదా.మాల్స్ లో ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉంటుంది.

 This Is The Biggest Mall In India.. Do You Know About The 19 Acre Mall , India's-TeluguStop.com

చిన్న పిల్లల గేమ్స్ దగ్గరి నుంచి పెద్ద వాళ్లు సినిమా చూసే వరకూ కూడా అన్ని వినోదభరిత వేదికలు మాల్స్ లో ఏర్పాటై ఉంటాయి.షాపింగ్స్, ఫుడ్ కోర్ట్, సినిమా థియేటర్స్, స్పా సెంటర్స్ ఇలా ఒక్కటేమిటీ ప్రతి ఒక్కటీ కూడా మాల్స్ లో అందుబాటులో ఉంటుంది.

మన దేశంలో అనేక మాల్స్ ఉన్నాయి.ముఖ్యంగా ప్రధాన నగరాల్లో మాల్స్ సంఖ్య భారీగానే ఉంది.

అయితే ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద మాల్ వెలసింది.ఇంతకీ అది ఎక్కడుందో, దాని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దేశంలోనే అతి పెద్ద మాల్ వెలసింది.ఈ మాల్ ను ఫీనిక్స్ మీల్స్ ఏర్పాటు చేసింది.సుమారు 19 ఎకరాల్లో ఈ మాల్ ఏర్పాటై అందర్నీ ఆకర్షిస్తోంది.ఫీనిక్స్ సిటాడెల్ మాల్ ఏర్పాటుకు ఆ సంస్థ రూ.800 కోట్లు ఖర్చు చేసింది.కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ఈ మాల్ ను నిర్మించింది.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మాల్ మెయిన్ బిల్డింగ్ ఉంది.ఈ మాల్ లో దాదాపు 300 దుకాణాలు ఉన్నాయి.

Telugu Mall, Indias Mall, Latest, Madhya Pradesh, Phoenixcitadel-Latest News - T

రాబోవు సంవత్సరంలో ఈ మాల్ లోని షాప్స్ ద్వారా రూ.1000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.మాల్ లో ప్రత్యేకంగా ఉన్న ఎక్సలేటర్లు, సీటింగ్ అరేంజ్ మెంట్లు, అలాగే అద్దాలతో అలంకరణలో అందర్నీ ఇట్టే ఆకర్షిస్తున్నాయి.

ఇంత పెద్ద మాల్ ను రోజుకు కొన్ని వేల మంది సందర్శించి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.వచ్చే ఏడాది ఈ బిజినెస్ వెయ్యి కోట్లు దాటనుందంటే ఇక్కడ ఎలా వ్యాపారం జరుగుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube