ఇదేం దారుణం.. అమ్మ‌వారికి నైవేద్యంగా త‌న గొంతుకోసుకుని ర‌క్తాన్ని..

తాము ఇష్టంగా పూజించే దేవుడికి భక్తులు నైవేద్యం సమర్పించడం కామన్.అలా నైవేద్యం సమర్పించడం ద్వారా తమకు మంచి జరుగుతుందని, తమ కోరికలను దేవుడు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం.

 This Is Terrible .. Blood As An Offering To The Mother . Susaide,  Viral News ,-TeluguStop.com

కాగా, దేవుడికి ఎవరైనా సాధారణంగా పండ్లు, ఫలాలు లేదా ఏవైనా తీపి వంటకాలు నైవేద్యంగా పెడుతారు.కానీ, ఓ వ్యక్తి రక్తాన్ని నైవేద్యంగా ప్రసాదించాడు.

అది కూడా మనిషి రక్తాన్ని.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటేఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో జరిగింది.

స్థానికుల వివరాల ప్రకారం.మీరట్ డిస్ట్రిక్ట్‌లోని ఖర్‌ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామ అడవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది.

ఆ గ్రామానికి చెందిన ఓ అమ్మాయి అమ్మవారిని నిత్యం భక్తి శ్రద్దలతో ఆరాదించేది.అమ్మ వారు అంటే సదరు యువతికి చాలా భక్తి ప్రతీ రోజు టెంపుల్‌కు వెళ్లి మొక్కులు చెల్లించేది ఈ యువతి.

అయితే కొన్ని రోజుల తర్వాత సదరు అమ్మాయి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి.ఈ క్రమంలోనే సదరు యువతి తనను తాను అమ్మవారి కూతురుగా అనుకుంది.ప్రతీ రోజు క్రమం తప్పకుండా టెంపుల్‌కు వెళ్లే యువతి ఓ రోజు షాకింగ్ డెసిషన్ తీసుకుంది.రోజులాగే ఆలయంలో పూజలు చేసిన తర్వాత నైవేద్యంగా తన గొంతు కోసుకుని ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది.

అయితే, గొంతు కోసుకున్న ప్రాంతంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై రక్తం తీవ్రంగా కారిపోయంది.ఈ క్రమంలోనే టెంపుల్ గుడి గంటలకు ఉరి తాడు బిగించుకున్నట్లుంది.

పూజారి వచ్చి చూసేసరికి ఆ యువతి గుడి గంటలకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది.

Telugu Nivedyam, Uttar Pradesh-Latest News - Telugu

అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయిందని గ్రహించాడు.గ్రామస్తులు, పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.అయితే, యువతి ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube