తెలంగాణ రాజకీయ పటంలో స్థానం కోసం వైఎస్.షర్మిల తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డిని, తన అన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎన్ని మాటలన్నా.
కానీ వైఎస్.షర్మిల మౌనంగా ఉండటం చూసి అందర ఆశ్చర్యపోతున్నారు.
మంత్రి మాటలతో విబేధిస్త తెలంగాణ ద్రోహిగా తెలంగాణ రాజకీయాల్లో తనకు స్థానం ఉండదని యోచిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడ్డ నాటి నుంచి రెండు రాష్ర్టాలకు నడుమ జలవివాధాలు నడుస్తూనే ఉన్నాయి.
తెలంగాణ లో ఆవిర్భావం నుంచి ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏపీలో మాత్రం మార్పులు జరిగాయి.వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కృష్ణా జలాల వివాదం చిలికి చిలికి గాలివానలా తయారవుతోంది.ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఉన్న సఖ్యత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటుతో లేదనేది ఎవరూ కాదనలేని వాస్తవం.అంతగా రెండు ప్రభుత్వాల మధ్య తీవ్రంగా దూరం పెరిగిపోయింది.

కృష్ణా జలాల అక్రమ తరలింపులతో గుర్రుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం అక్రమ నీటి తరలింపులు ఆపాలని ఆంధ్ర పాలకులకు హెచ్చరికలు జారీ చేసింది.అయినా కానీ ఏపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది.తాజాగా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకని ఏపీ ప్రభుత్వం సంగమేశ్వర ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.ఇది నచ్చని తెలంగాణ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తూ వస్తోంది.

వైఎస్.షర్మిల తెలంగాణ రాజకీయాల్లో నూతన పార్టీని స్థాపించి ఇక్కడే ఉండాలని చూస్తోంది.ప్రస్తుతం ఈ వివాదంలో తలదూర్చితే తాను తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతానని తాను అనుకుంటున్నట్లు సమాచారం.
అందుకే తండ్రిని, అన్నను అన్ని మాటలన్నా కూడా ఆమె మాత్రం తన పార్టీ కోసం దేనికైనా సిద్దమే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.