ఇదేం విడ్డూరం!! సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని సంపాదించిన పిల్లి..

ఈ కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు కోల్పోతుంటే… ఆస్ట్రేలియాలో మాత్రం ఒక పిల్లి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని సంపాదించి యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.ఆస్ట్రేలియాలోని ఓ ఆసుపత్రికి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం సంపాదించి మెడలో ఐడి కార్డు వేసుకొని కాపలా కాస్తున్న పిల్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సన్షేనల్ గా నిలుస్తున్నాయి.

 This Is Ridiculous Cat Who Got A Job As A Security Guard Cat, Austraila, Securi-TeluguStop.com

ఇంతకీ ఈ విచిత్రమైన ఆస్ట్రేలియన్ పిల్లి కథాకమామిషు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాలోని ఎప్‌వర్త్ ఆసుపత్రి ముందు ఒక పిల్లి ప్రతిరోజు తిరుగుతూనే ఉంది.

ఐతే ఆసుపత్రి లోపల వెలుపల తిరుగుతూ ప్రతి ఒక్క రోగికి ముచ్చట కలిగించే ఈ పిల్లిని చూసిన హాస్పిటల్ యాజమాన్యానికి ఓ బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది.అలా వారికి ఆ ఆలోచన తట్టిందో లేదో కానీ వెంటనే పిల్లి ని పిలిపించి ఎలీవుడ్ అని నామకరణం చేసి మెడలో ఒక సెక్యూరిటీ గార్డ్ ఐడి కార్డు వేసి పంపించారు.

ఎలాగో తమ ఆసుపత్రి చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఆస్పత్రి సెక్యూరిటీ కార్డ్ ఐడి ఇస్తే దాన్ని ఎవరూ కూడా ముట్టుకోరని భావించిన ఆస్పత్రి అధికారులు ఈ పని చేశారని తెలుస్తోంది.

అయితే సెక్యూరిటీ గార్డుగా పని చేసినందుకు గాను పిల్లికి ఫ్రీ మెడికల్ చెకప్ తో పాటు ఆహారం కూడా అందిస్తున్నారు.

మెడలో సెక్యూరిటీ కార్డు వేసిన తర్వాత ఎలీవుడ్ పిల్లి గతంలో కంటే ఇప్పుడే ఇంకా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆసుపత్రి మొత్తం తిరుగుతూ రోగులను బాగా ఫిదా చేస్తోందట.ఏది ఏమైనా ఆస్ట్రేలియా దేశస్థుల ఉపాయానికి అందరూ కూడా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube