మూడున్నరేళ్ల వయసులోనే ఇంతటి ప్రతిభా.. ఎవరీ ఇవాన్షికా సర్వేపల్లి..!!

ఒత్తిడిలో ఉన్నారా? కష్టాలను కాసేపు మైమరిచిపోవాలని అనుకుంటున్నారా? అయితే.ఈ చిన్నారి మాటలు వినండి.

 This Is Really Amazing To Listen To The Youngest Story Teller Of Just 3years-TeluguStop.com

తప్పకుండా మీ మనసుకు ప్రశాంతత తథ్యం.పబ్లిక్ స్పీకింగ్, పాటలు, సంగీతం, మ్యాథమేటిక్స్ ఇలా అనేక అంశాల్లో తన అపారమైన ప్రజ్ఞా పాటవాలతో అందరినీ ఆకట్టుకుంటోంది అమెరికాలో ఓ భారత సంతతి చిన్నారి.

న్యూజెర్సీకి చెందిన ఎస్ఎస్ ఇవాన్షిక సర్వేపల్లి వయసు మూడున్నర సంవత్సరాలే.కానీ ఆమెలో ఒక మోటివేషనల్ స్పీకర్, పియనిస్ట్ వున్నారు.ఇక ఆ పాప అద్భుతమైన స్టోరీ టెల్లర్ కూడా.ఆమె కథ చెప్పే విధానానికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

 This Is Really Amazing To Listen To The Youngest Story Teller Of Just 3years-మూడున్నరేళ్ల వయసులోనే ఇంతటి ప్రతిభా.. ఎవరీ ఇవాన్షికా సర్వేపల్లి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మూడున్నరేళ్ల వయసంటే కనీసం మాటలు కూడా సరిగా రావు.మరి ఆ వయసులోనే అంతటి ప్రతిభ వెనుక తల్లిదండ్రులు ప్రోత్సాహంతో పాటు భగవంతుడిచ్చిన వరమనే చెప్పుకోవాలి.

ఇప్పటికే ఆమె తన పేరిట అనేక రికార్డుల్ని లిఖించుకుంది.మూడుసార్లు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, నాలుగు సార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఇవాన్షిక చోటు దక్కించుకుంది.రెండున్నర సంవత్సరాల వయసులోనే పీరియాడికల్ టేబుల్‌ను అనర్గళంగా చెప్పిన పిన్న వయస్కురాలిగా మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది.

అంతేకాకుండా అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులను, ప్రశంసలను పొందింది.పబ్లిక్ స్పీకింగ్ ఛాంపియన్ షిప్ అవార్డులకు లెక్కే లేదు.గ్లోబల్ ఐకాన్ అవార్డు, లిటిల్ సైంటిస్ట్ అవార్డు, ఇన్‌క్రిడిబుల్ పెర్ఫార్మర్ అవార్డు, లిటిల్ బ్రెయిన్ ట్విస్టర్ అవార్డు, స్టార్ పెర్ఫార్మెన్స్ అవార్డు, ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మర్ అవార్డు సహా మరెన్నో పురస్కారాలను ఆమె అందుకుంది.

ప్రతిష్టాత్మక గ్లోబల్ ఛైల్డ్ ప్రాడిజీ అవార్డుకు ఇవాన్షిక నామినేట్ అయ్యింది.

భారత ప్రభుత్వ చిన్న, సూక్ష్మ మరియు మధ్యతరగతి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనుబంధ పాజిటివ్ థాట్స్‌‌లోనూ, ఐడీవైఎం ఫౌండేషన్ స్టూడెంట్ కౌన్సిల్‌‌లోనూ ఇవాన్షిక సభ్యురాలు.‘‘Creative writings modern age’’ ఫేస్‌బుక్ పేజీలోనూ, Talking stories radio‌లోనూ ఈమె గురించి ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి.

#Child Prodigy

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు