ఇది మామూలు ఫీల్డింగ్ కాదు బాసు.. చిరుత‌లా ఎగిరి క్యాచ్ ప‌ట్టాడు

This Is Not A Normal Fielding Boss Caught Flying Like A Cheetah

క్రికెట్‌.ఈ మాట‌కు, మ‌న దేశానికి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది.మ‌న దేశంలో క్రికెట్ అంటే యూత్ ప‌డి చ‌స్తారు.కేవ‌లం యూత్ అనే కాదు.చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి, పెద్ద వారి దాకా అంద‌రూ క్రికెట్ ను అంత‌లా ఆరాదిస్తారు.క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి వార్త అయినా స‌రే విప‌రీతంగా వైర‌ల్ అవుతుంది.

 This Is Not A Normal Fielding Boss Caught Flying Like A Cheetah-TeluguStop.com

ఇక స్టేడియంలో జ‌రిగే కొన్ని ఘ‌ట‌న‌ల‌కు కూడా బాగానే వ్యూస్ వ‌స్తుంటాయి.అలాంటివి మీడియాలో, అటు సోష‌ల్ మీడియాలో కూడా బాగానే పాపుల‌ర్ అవుతుంటాయి.

ఇక క్రికెట్ స్టేడియంలో ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్‌.

 This Is Not A Normal Fielding Boss Caught Flying Like A Cheetah-ఇది మామూలు ఫీల్డింగ్ కాదు బాసు.. చిరుత‌లా ఎగిరి క్యాచ్ ప‌ట్టాడు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెరుపు వేగంతో వ‌చ్చే బాల్‌ను క్ష‌ణ కాలంలో ప‌ట్టుకోవ‌డం చాలా ముఖ్యం.

ఇలా చిరుత క‌న్నా స్పీడుగా క‌దిలి బంతిని బౌండ‌రీ దాట‌నివ్వ‌కుండా అడ్డుకున్న వారు అనేక మంది ఉన్నారు.ఇక మెరుపు వేగంతో కింద ప‌డి మరీ క్యాచ్ ప‌ట్టిన వారు అనేక మంది ఉన్నారు.

ఇక ఇప్పుడు కూడా ఇండియా సౌత్ ఆఫ్రికా దేశాల న‌డుమ జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు పీట‌ర్స‌న్‌.పుజారా బ్యాటింగ్‌కు రాగా.

అత‌ని మీద చాలా అంచ‌నాలు ఉండేవి.ఎందుకంటే టెస్టు మ్యాచ్ లో అత‌ను అత్యంత నిల‌క‌డ‌గా రాణిస్తాడు.

కాగా మార్కో యాన్సన్ సౌత్ ఆఫ్రికా నుంచి బౌలింగ్ కు దిగాడు.ఇక ఆ బాల్‌ను లెగ్ స్లిప్ పొజీష‌న్ లో ఉన్న పుజారా.అమాంతం గాల్లోకి లేపేశాడు.ఇక ఆ బాల్‌ను కీగన్ పీటర్సన్ చిరుత వేగంతో అందుకున్నాడు.అత‌ను ఎంత మెరుపు వేగంతో ఆ బాల్‌ను అందుకున్నాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు.ఎందుకంటే అంత వేగంగా ఎవ‌రు క‌ద‌లడం అయినా చాలా క‌ష్టం.

కండ్లు మూసి తెరిచే లోగా ఆ బాల్‌ను ఒడిసి ప‌ట్టేశాడు.దీంతో పుజారా ఔట్ అయ్యాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

#Africa #Cricket #Peterson #Pujara #India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube