ఇది మామూలు ఐడియా కాదు బ్రో.. చెప్పుల‌కు న‌ట్ బోల్టులు అమ‌ర్చిన వ్య‌క్తి

కొంద‌రి ఆలోచ‌న‌లు చూస్తే నిజంగానే షాక్ అవుతుంటాం.చిన్న చిన్న వ‌స్తువుల‌ను కూడా త‌మ క్రియేటివిటీతో వార్త‌ల్లో నిలిచేలా చేస్తుంటారు.

 This Is No Ordinary Idea Bro A Man Fitted With Nut Bolts To Sandals, Sandals, Nut Bolts , Strange Idea, Nut Bolts To Slippers, Slippers, Idea, Creativity, Without Breaking Slippers, Social Media, Viral-TeluguStop.com

ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఇలాగే ఎవ‌రూ ఊహించ‌ని ప‌ని చేసి వార్త‌ల్లోకి, నెట్టింట్లోకి వ‌చ్చేశాడు.మామూలుగా చెప్పులు వ‌ర్షాకాలంలో తెగిపోవ‌డం అనేది కామ‌న్ క‌దా.

ఎందుకంటే బుర‌ద‌లో స్లిప్ అయిన‌ప్పుడో లేదంటే వ‌ర్షంలో న‌డుస్తున్న క్ర‌మంలోనో తెగిపోవ‌డం కామ‌న్‌.అయితే ఇలా చెప్పులు తెగిపోతే దాన్ని కుట్టించుకోవ‌డమో లేదంటే కొత్త‌వి కొనుక్కోవ‌డ‌మో చేస్తుంటాం.

 This Is No Ordinary Idea Bro A Man Fitted With Nut Bolts To Sandals, Sandals, Nut Bolts , Strange Idea, Nut Bolts To Slippers, Slippers, Idea, Creativity, Without Breaking Slippers, Social Media, Viral-ఇది మామూలు ఐడియా కాదు బ్రో.. చెప్పుల‌కు న‌ట్ బోల్టులు అమ‌ర్చిన వ్య‌క్తి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ చెప్పు తెగిన దాన్ని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటాం.

ఎక్కువ‌గా ఈ సీజ‌న్‌కు త‌గ్గ‌ట్టు చెప్పులు వాడే క్ర‌మంలో గూటాలు ఉండే చెపుల‌నే వేసుకుంటా.

ఈ గూటాలు తెగిపోయిన‌ప్పుడు కొత్త‌వి వేయించుకోవ‌డ‌మో లేదంటే కుట్టించుకోవ‌డ‌మో చేస్తుంటాం.కానీ ఓ వ్య‌క్తి మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించాడు.

త‌న తెలివితో చెప్పుల‌ను వెరైటాగా మార్చేశాడు.ఆ గూటాల ప్లేస్ లో ఏకంగా నట్-బోల్ట్‌లను కుట్టి తెగిపోకుండా అమ‌ర్చేశాడు.

మ‌ళ్లీ దారంతో కుడితే తెగిపోతాయ‌నుకున్నాడో ఏమో తెలీదు గానీ ఇంకోసారి చెప్పులు తెగిపోకుండా ఉండేందుకు మాస్ట‌ర్ ప్లాన్ వేశాడ‌ని తెలుస్తోంది.

రెండు చెప్పుల‌కు రెండు న‌ట్ల‌ను బిగించి బోల్టులు అమ‌ర్చాడు.

దీన్ని చూసిన వారంతా కూడా షాక్ అయిపోతున్నారు.

Telugu Creativity, Idea, Nut Bolts, Sandals, Slippers, Strange Idea-Latest News - Telugu

ఇక అత‌ను చెప్పుల‌కు బిగించిన నట్ బోల్టుల‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చెక్క‌ర్లు కొడుతున్నాయి.దాన్ని చూసిన వారంతా కూడా వాట్ ఏ ఐడియా బ్రో.అస‌లు ఇలాంటి ఐడియాలు ఎలా వ‌స్తాయండి అంటూ కామెంట్లు కురిపించేస్తున్నారు.

అతని తెలివితేటలకు అంద‌రూ ఫిదా అవుతున్నారు.ఇంకొంద‌రు మాత్రం అత‌ను ఎంత పేద‌రికంలో ఉన్నాడో అంటూ జాలి చూపిస్తున్నారు.

ఇలా ర‌క‌ర‌కాల కామెంట్లు వ‌చ్చేస్తున్నాయి.ఇలా చేసింది ఎవ‌రో తెలీదు గానీ నెట్టింట మాత్రం హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube