ఇది మామూలు క్రియేటివిటీ కాదు.. వైన్‌తో న‌డుస్తున్న కారు..

కారు కొనాల‌నేది స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి ఆశ‌.ప్ర‌తి ఒక్క‌రూ కారు కొనుక్కుని ఎంచ‌క్కా అందులో ప్ర‌యాణించాల‌ని క‌ల‌లు గంటారు.

 This Is No Ordinary Creativity .a Car Running With Wine , Car With Wine, Prince-TeluguStop.com

అయితే ఇప్పుడు కార్లు కొనాల‌నుకునే వారి ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే.అస‌లు పెట్రోల్, డీజిల్ రేట్లు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి.

దీంతో వాటిని కొనేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.ఇలాంటి స‌మ‌యంలో చాలామంది ఎల‌క్ట్రిక్ కార్లు కొనేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

కాలా ఈ మ‌ధ్య పెట్రోల్ కు కొంచెం ప్ర‌త్యామ్నాయంగా సీఎన్‌జీ గ్యాస్ రావ‌డంతో అంద‌రూ దానివైపు మొగ్గు చూపుతున్నారు.

దీంతో కూడా కొన్ని ప్రాబ్ల‌మ్స్ రావ‌డంతో ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తగ్గించ‌డంల‌తో పాటు ఇంధనాన్ని ఆదా చేసేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ కార్లు వాడ‌కం విప‌రీతంగా పెరిగిపోతోంది.

కాగా ఇప్పుడు ఓ వార్త నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.అదేంటంటే బ్రిటీష్‌ రాజవంశానికి ప్ర‌స్తుతం చక్రవర్తి అయిన‌టువంటి ప్రిన్స్‌ చార్లెస్ గురించి ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయేది.

అంద‌రిలాగా ఆయ‌న డీజిల్‌, లేదా పెట్రోల్ కు బ‌దులుగా వైన్‌తో కారును న‌డ‌ప‌డం ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారిపోయింది.

Telugu Car Wine, Prince Charles, Wine-Latest News - Telugu

ఏంటి వైన్స్‌తోనే అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు క‌దా అవునండి ఇప్పుడు ఇదే నిజం.ప్రిన్స్‌ ఛార్లెస్ తాను 21ఏండ్లుగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌కు బ‌హుమ‌తిగా వ‌చ్చినటువంటి ఆస్టన్‌ మార్టిన్ ను ఇప్ప‌టికీ వాడుతూనే ఉన్నారు.దాన్ని చార్లెస్ కోరిక మేర‌కు ఇంజనీర్లు స‌రికొత్త‌గా ఆవిష్క‌రించారు.ఏకంగా దాన్ని వైన్ తో న‌డిచే విధంగా త‌యారు చేశార‌.ఇప్పుడు రాజా వారి బకింగ్‌హామ్‌ ప్యాలేస్‌లో వారు వైన్‌ను వాడ‌కోగా ఏమైనా మిగిలిపోతే గ‌న‌క దాన్ని కారు కోసం వినియోగిస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఇంకో విచిత్రం ఏంటంటే కొన్ని కొన్ని సార్లు విరిగిపోయిన పాలను కూడా దీని కోసం ఉప‌యోగిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube