మ్యాజిక్కా లేక సైన్సా ...? వాటర్ బాటిల్ ని మోస్తున్న టూత్ పిక్...!

నిజానికి మనం ఎంత చదువుకున్న, ఎంత సమర్ధవంతులమైన సరే కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందు జరిగేటప్పుడు వాటిని నమ్మలేము కూడా.అందులో కొన్ని నిజానికి అసలు అర్థం కావు కూడా.

 This Is Magic Or Science, By Using Tooth Pick Water Bottle Is Stand,magic,scienc-TeluguStop.com

ఆ సంఘటన నిజంగా ఒక సైన్సా.? లేకపోతే ఓ మ్యాజిక్కా..? అనేది అంతుచిక్కదు.ఇలాంటి సంఘటనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే ఒక్క టూత్ పిక్ నిండు వాటర్ బాటిల్ బరువు మోస్తుందా అంటే మీరు ఏమి చెబుతారు.

దానికి సమాధానంగా మీరు ఏమైనా జోక్ వేస్తున్నారా…? లేకపోతే అంత సీన్ లేదంటూ కొట్టిపారేస్తున్నారు.

అయితే ఈ విషయం లో మాత్రం ఓ వ్యక్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.

ఓ టేబుల్ అంచున టూత్ పిక్ ను ఉంచి దానికి వాటర్ బాటిల్ ని వేలాడదీశాడు.మామూలుగా అలా అయితే టూత్ పిక్ కింద పడి పోవాలి.

కానీ, అక్కడ అలా జరగలేదు.నిండు వాటర్ బాటిల్ బరువు మొత్తాన్ని ఆ టూత్ పిక్ మోసింది.

దీంతో ఆ వాటర్ బాటిల్ గాల్లోనే తేలినట్లు అయ్యింది.

Telugu Toothpick, Magic, Science, Magic Science, Tooth Pick, Bottle-Latest News

అయితే ఇందుకుగాను ఓ వ్యక్తి టూత్ పిక్ ను టేబుల్ అంచున పెట్టి దానిపైన ఓ పాలతో నిండిన క్యాన్ ను పెట్టాడు.దానికి ఆ బరువుతో అది కింద పడకుండా అలాగే ఉండిపోగా, ఆ తర్వాత ఆ టూత్ పిక్ కు వాటర్ బాటిల్ ను వేలాడదీశాడు.ఆ తదుపరి మరో టూత్ పిక్ ను తాడు మధ్యలో ఉంచి టేబుల్ పై ఉన్నటువంటి టూత్ పిక్ కు మరొక టూత్ పిక్ ను 90 డిగ్రీల కోణంలో దానిని అమర్చాడు.

ఇక దాంతో చిన్నగా మొదటి టూత్ పిక్ పై పెట్టిన పాల క్యాన్ ను తీసేశాడు.నిజానికి అలా చేస్తే… బాటిల్ కింద పడి పోవాలి.కానీ, అక్కడ అలా జరగలేదు.టూత్ పిక్ కు నిండు వాటర్ బాటిల్ అలాగే వేలాడుతూ ఉంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియోకు అనేక మంది అనేక రకాలుగా సమాధానాలు ఇస్తూ… ఇందులో మ్యాజిక్ ఏమీ లేదంటూ కేవలం అందులో సైన్స్ దాగుందంటూ నెటిజన్లు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube