లక్కంటే ఇదీ..ఒక్క రోజులో కోటీశ్వరుడైన భారతీయుడు..!!!

భారతీయులు ఉపాది కోసం మస్కట్, అబుదాబి, లకు వలసలు వెళ్తూ ఉంటారు.ముఖ్యంగా ఆయా దేశాలలో లాటరీలను అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు.

 This Is Lakkante A Millionaire Indian In One Day-TeluguStop.com

ఆదేశ వాసులతో పాటు వలస వాసులు కూడా లాటరీలు కొనుగోలు చేసి తమ అదృష్టాలను పరీక్షించుకుంటారు.ఉపాది కోసం వెళ్ళిన ఎంతో మంది భారత వలస వాసులు కోటీశ్వరులు అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

డబ్బున్నోళ్ళకు లాటరీ తగలడం పెద్ద విషయం కాదు.కూలి నాలి చేసుకునే వారిని లాటరీ వరిస్తే…అది కూడా ఊహించని విధంగా కోట్ల రూపాయలు వచ్చి పడితే అబ్బా ఆ సంతోషమే వేరు అచ్చం ఇలాంటి సంఘటనే మస్కట్ లో ఓ భారతీయుడికి ఎదురయ్యింది.

 This Is Lakkante A Millionaire Indian In One Day-లక్కంటే ఇదీ..ఒక్క రోజులో కోటీశ్వరుడైన భారతీయుడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉపాది కోసం మస్కట్ కు వలస వెళ్ళిన భారతీయుడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు.వివరాలలోకి వెళ్తే.

కేరళకు చెందిన శ్యామ్ అనే వ్యక్తి సుమారు 20 ఏళ్ళ క్రితమే మస్కట్ లో ఉద్యోగానికి వెళ్ళారు.అక్కడే ఉంటూ కుటుంభాన్ని పోషించుకుంటున్నాడు.ఎన్ని ఇబ్బందులు ఉన్నా తన అదృష్టాన్ని లాటరీల రూపంలో ఎప్పటికప్పుడు పరీక్షించుకునే శ్యామ్ కొన్ని రోజుల క్రితం లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.అయితేఊహించని విధంగా తాను కొన్న టిక్కెట్టు డ్రాలో గెలుచుకున్నట్టుగా అతడికి మెయిల్ అందింది.

ముందు అది ఫేక్ అనుకున్నా తరువాత సంస్థ యాజమాన్యం శ్యామ్ కు ఫోన్ ద్వారా వివరాలు చెప్పడంతో షాక్ అయిపోయాడు.ఇంతకీ అతడు గెలుచుకున్న మొత్తం అక్షరాలా రూ. 2 కోట్ల రూపాయలు.రాత్రికి రాత్రే తనకు వచ్చిన ఈ అదృష్టాన్ని చాలా సేపటి వరకూ నమ్మలేక పోయానని, ఈ డబ్బుతో కష్టాలు అన్నీ తీరిపోనున్నాయని చెప్పిన శ్యామ్, కేరళ వెళ్ళిపోయి కొత్త ఇల్లు కొనుక్కుంటానని తెలిపాడు.

#Lotteries #Shayam #Millionaire #Muscat #2 Crores

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు