ఇదేందయ్యా ఇది: ఆ స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కశ్మీర్‌ను ఏకంగా దేశం చేసిందిగా..!

ఒక రాష్ట్రంలోని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏకంగా ఓ రాష్ట్రాన్ని దేశంగా చేసింది.ఏ రాష్ట్రం ఏ రాష్ట్రాన్ని దేశంగా మార్చయంటే ఈ స్టోరీ చదవక తప్పదు.

 This Is It The State Education Department Made Kashmir A Single Country , Kashmi-TeluguStop.com

బీహార్ లో జరుగుతున్న ఏడవ తరగతి అర్ధ వార్షిక పరీక్షలో కశ్మీర్ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు.? అదేంటి కశ్మీర్ ప్రత్యేక దేశం ఎప్పుడైందని జుట్టు పిక్కోకండి.అవును ఈ ప్రశ్న బీహార్‌లో జరుగుతున్న హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో ఉన్నది.దీనికి రెండు మార్కులు కూడా కేటాయించారు.ప్రశ్నపత్రం రూపొందించిన వారు చేసిన పొరపాటు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నది.ఏకంగా ప్రభుత్వ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షల్లో ఇలాంటి తప్పులు రావడమేంటని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

కిషన్ంజ్ జిల్లాలో పాఠశాల విద్యార్థులకు అర్ధవార్షిక పరీక్షలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా ఏడో తరగతి ప్రశ్నపత్రంలోని మొదటి బిట్టులో.కింది దేశాల్లో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారని అడిగారు.అందులో ఐదు ప్రశ్నలు అడిగారు.

మొదటి ప్రశ్నలో చైనాలో నివసించే వారిని ఏమంటారని, తర్వాత నేపాల్, ఇంగ్లండ్ దేశ ప్రజలను ఏమని పిలుస్తారనే ప్రశ్నలు ప్రశ్న పత్రంలో అడిగారు.నాలుగో ప్రశ్నగా కశ్మీర్ ప్రజలను ఏమంటారని, ఐదో ప్రశ్నలో ఇండియాలో నివసించేవారిని ఏమని పిలుస్తారని అడిగారు.

ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.ఇందులో మొదటి ప్రశ్నకు అందులోనే జవాబు ఇచ్చారు.

మిగిలిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలని ప్రశ్న పత్రంలో అడిగారు.

Telugu Kashmir, Latest-Latest News - Telugu

వీటిలో ఒక ప్రశ్న.“కశ్మీర్ ప్రత్యేక దేశంగా ఎప్పుడు ఏర్పడింది” అని విద్యార్థులకు కనిపించింది.ఇండియాలో కశ్మీర్ ఒక చిన్న రాష్ట్రం అని ఎవరినడిగినా చెబుతారు.

అలాంటిది ఆ రాష్ట్రాన్ని దేశంగా ఈ ప్రశ్నలో పేర్కొనడం విద్యార్థులను ఒకింత కన్ఫ్యూజ్ చేసింది.అలానే ఇది స్పెషల్ దేశం ఏంటి అని చాలామంది అవాక్కయ్యారు.

అనంతరం ఇదేం ప్రశ్న అంటూ విద్యార్థులు ఇన్విజిలేటర్‌ను అడిగారు.అలా ఈ పెద్ద పొరపాటు బయటపడింది.

ఇలాంటి బిగ్ మిస్టేక్‌పై ఆశా లతా మిడిల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్కే దాస్ స్పందించారు.ఈ ప్రశ్న తాము అడిగింది కాదని.

తమకు ఈ క్వశ్చన్ పేపర్ గవర్నమెంట్ నుంచి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.కశ్మీర్‌లో జీవించేవారిని ఏమని పిలుస్తారనే దానికి బదులు పీపుల్ ఆఫ్ కంట్రీ ఆఫ్ కశ్మీర్ అని తప్పుగా ప్రింట్ పడి ఉంటుందని అన్నారు.

దీనిని కాస్త సీరియస్‌గా పరిగణించిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.ఈ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube