ఇదేందయ్యా ఇది: ఇలా డబ్బులు చెట్లకు కూడా కాస్తాయా..?!

This Is It Money Can Cost Trees Too

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్ని వీడియోలు మనల్ని అబ్బురపరుస్తుంటాయి.

 This Is It Money Can Cost Trees Too-TeluguStop.com

అయితే మనల్ని ఆశ్చర్యపరిచే వీడియోలన్నీ నిజం కాకపోవచ్చు.కానీ అవి చూడడానికి మాత్రం చాలా నమ్మశక్యంగా ఉంటాయి.

తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో ఓ వ్యక్తి క్యాప్సికం (ఓ రకమైన మిరపకాయ) చెట్టు కాయల నుంచి కరెన్సీ నాణేలు బయటికి తీశాడు.

 This Is It Money Can Cost Trees Too-ఇదేందయ్యా ఇది: ఇలా డబ్బులు చెట్లకు కూడా కాస్తాయా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.అసలు ఆ కాయ లోపలకి కరెన్సీ కాయిన్స్ ఎలా వచ్చాయి? నిజంగానే ఆ చెట్టు కాయల్లో గింజలకు బదులు రూపాయి బిళ్లులు కాస్తున్నాయా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ అయిన వీడియో ప్రకారం.ఓ వ్యక్తి తన పెరట్లో పెద్ద ఎత్తున క్యాప్సికం మొక్కలు నాటాడు.ఆ మొక్కలు పెరిగి పెద్దయి.కోత దశకు వచ్చాయి.

ఈ క్రమంలో అతడు తన క్యాప్సికం తోటకు వెళ్లాడు.మొదటగా ఒక క్యాప్సికం కాయను మధ్యగా చీల్చాడు.

అంతే ఆ కాయలో నుంచి పదుల సంఖ్యలో కరెన్సీ కాయిన్స్ బయటపడ్డాయి.అలాగే దాని పక్కనే ఉన్న మరొక కాప్సికాన్ని కూడా కట్ చేసాడు.

అందులో కూడా కుప్పలుతెప్పలుగా కాయిన్స్ కనిపించాయి.ఇదంతా కూడా చూసేందుకు చాలా నమ్మదగినదిగా అనిపించింది.

కానీ నిజానికి ఈ వ్యక్తి వీడియో తీయడానికి ముందు క్యాప్సికం కాయలను మధ్యగా కట్ చేసి అందులో కాయిన్స్ పెట్టి తర్వాత దాన్ని జిగురుతో గట్టిగా అంటించాడు.అందుకే ఆ కాయలు అలా ఎలాంటి రంధ్రం లేకుండా కనిపించాయి.

తర్వాత ఏమీ ఎరగనట్టు వాటిని చీల్చి నిజంగానే అందులో కాయిన్స్ ఉన్నట్లు చూపించాడు.

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.నిజంగా చెట్లకు కాయలు కాయవని చిన్నపిల్లలను అడిగినా చెప్తారు కాబట్టి ఇది ఫేక్ అని అందరూ గ్రహించాలి.అయినప్పటికీ ఈ ట్రిక్ మాత్రం చాలామంది నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

దాంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

#Trees #Money

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube