ఇదేందయ్యా ఇది.. ఈ యువకుడి ర్యాంప్ వాక్ చూస్తే నవ్వు ఆగదు..!

ఫ్యాషన్ టేస్టు శృతిమించితే అది అందంగా కనిపించడం అటుంచితే అందరిలో నవ్వులపాలు కావడం ఖాయం.సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఎంత వెరైటీగా డ్రెస్సులు వేసుకుంటారో మీరు చూసే ఉంటారు.

 This Is It.. I Can't Stop Laughing When I See This Young Man's Ramp Walk , Ramp-TeluguStop.com

అతి వీర భయంకరంగా ఉండే ఈ డ్రెస్సులు చూస్తే నవ్వు రాక తప్పదు.ఇక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసే కొన్ని మోడల్స్ వేసే డ్రెస్సులు కూడా చాలా వింతగా ఉంటాయి.

కొందరు తలపైన ఒక చిన్న ఇల్లు లాంటిది ధరించి వస్తుంటారు.కొందరు తమ మెడకి ఒక పెద్ద పరుపు వేసుకుని వస్తారు.

యూట్యూబ్ లో ఫన్నీ ఫ్యాషన్ డ్రెస్సులకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి.

అయితే మోడల్స్ వేసుకునే ఫ్యాషన్ డ్రెస్సులు, వారి టేస్ట్ ఎంత చిత్ర విచిత్రంగా ఉంటాయో షహీల్ షెర్మాంట్ అనే మోడల్ ఒక వీడియో చేసి మరీ చూపించాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకున్నారు.ఫిజీ దేశానికి చెందిన మోడల్ షహీల్ బీభత్సమైన ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అయ్యే వారిని ఎగతాళి చేస్తూ వీడియో చేశాడు.వారు వేసుకునే డ్రెస్సులు తన ఇంట్లో మూలనపడ్డ వస్తువుల లాగా ఉంటాయని చెప్పకనే చెప్పాడు.

వైరల్ అవుతున్న వీడియోలో షహీల్ అట్ట పెట్టెలు, నిచ్చెన, టేబుల్, చైర్, మొక్కల కుండీలు, డబ్బా రేకులు, డోర్, హౌజ్ గేటు, మంచం పట్టీలు, వాటర్ డ్రమ్ము వంటివన్నీ ధరించి ర్యాంప్ వాక్ చేశాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

ఈ ఫన్నీ వీడియోని డా.అజతీయ ట్విటర్‌లో షేర్ చేయగా దీనికి ఇప్పటికే 1 కోటి 24 లక్షల వ్యూస్, 3.3 లక్షల లైక్స్ వచ్చాయి.ఈ ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube