మనం వండే అన్నం అనారోగ్యం .. ఇలా వండితేనే ఆరోగ్యం  

This Is How You Should Cook Rice For A Healthy Body-

కూలి పనిచేసుకోని బ్రతికేవారు ఎప్పటికప్పుడు కాలరీలను ఖర్చుపెడతారు కాబట్టి, వారి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కాని కంప్యూటర్ మీద కూర్చోని పనిచేసేవారు, శారీరక శ్రమ ఎక్కువ లేని వారు కూడా అన్నం మీదే ఆధారపడితే ఎలా ? ప్రతి వంద గ్రాముల వైట్ రైస్ లో 150కి పైగా కాలరీలు లభిస్తాయి. రెండు పూటల, కడుపునిండా అన్నం తింటారు మన తెలుగు జనాలు. ఏం లాభం? ఆ కాలరీలు ఖర్చు మాత్రం కావు. అందుకే శారీరక శ్రమకి శరీరం సహకరించదు..

మనం వండే అన్నం అనారోగ్యం .. ఇలా వండితేనే ఆరోగ్యం-

బరువు పెరిగిపోతుంటాం. అధిక కొవ్వు జమ అయిపోతుంటుంది.కాని, బియ్యాన్ని మనం ఇప్పుడు వండుకుంటున్న పద్ధతిలో కాకుండా, మరో పద్ధతిలో వండుకుంటే కాలరీల కౌంట్ తగ్గించవచ్చు.

అప్పుడు మనకి అధిక బరువు సమస్యలు ఉండవు. అవసరానికి మించిన కాలరీలు శరీరంలోకి చేరవు.కొబ్బరినూనెతో అన్నం వండుకోవడం సత్ఫలితాల్ని ఇస్తుంది.

అంటే, వంటల్లోకి వాడే కొబ్బరినూనెని తీసుకోవాలి. 100 గ్రాముల బియ్యంలో 3 గ్రాముల కొబ్బరినూనె తీసుకోవాలి. ఇలా బియ్యం యొక్క మోతాదు పెంచుకున్నా కొద్ది, నూనె యొక్క మోతాదు పెంచుకోవాలి. బియ్యంలో కొబ్బరినూనె కలిపి, అన్నం ఉడికేదాకా వండాలి.

అన్నం రెడీ అయ్యాక అప్పుడే తినకూడదు. ఓ 12 గంటలు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, మళ్ళీ కొద్దిగా వేడి చేసి తినాలి. దీంతో కాలరీల కౌంట్ సగానికి పడిపోతుంది. అంటే ప్రతి 100 గ్రాముల రైస్ కి మామూలుగనైతే 151 కాలరీలు లభిస్తే, ఇలా వండుకున్న అన్నంలో ప్రతీ వంద గ్రాములకి 75.5 కాలరీలు మాత్రమే మన శరీరంలోకి చేరతాయన్నమాట. దీంతో అధిక బరువు, అధిక కొవ్వు లాంటి సమస్యలు తీరుతాయి.

ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక లాజిక్ ఏంటంటే . ఇలా కొబ్బరినూనెతో వండినందు వలన అన్నం రెసిస్టెంట్ స్టార్చ్ గా మారుతుంది.

అదే ఆరోగ్యకరమైన అన్నం. ఇప్పుడు కాలరీల కౌంట్ గురించి పట్టించుకోకుండా తింటున్నది కాదు.