ఆ నిర్ణయంతోనే రమేష్ బాబు సినిమా జీవితం అస్తమించింది?

ఘట్టమనేని అభిమానులందరు దిగ్భ్రాంతిలో మునిగి పోయారు.ఇప్పటికే మహేష్ బాబు కరోనా వైరస్ బారిన పడ్డాడు అని అభిమానులు ఆందోళన మునిగిపోయారు.

 This Is How Ramesh Babu Movie Life Ended Details, Ghattamaneni Ramesh Babu, Rame-TeluguStop.com

సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అభిమానులను.ఇక అంతలోనే ఊహించని ఘటన అటు ఘట్టమనేని కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు హఠాత్ మరణం అందరిని కలిచి వేసింది.గత కొంత కాలం నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సమయంలో తుది శ్వాస విడిచారు.

అయితే రమేష్ బాబు మొదటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని నిలబెట్టడం లో కీలక పాత్ర పోషించారు అని చెప్పాలి.చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అప్పట్లోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు రమేష్ బాబు.

సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించిన రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానం మొదలు పెట్టారు.ఆ తర్వాత దొంగలకు దొంగ, నీడ, పాలు నీళ్లు, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ లాంటి సినిమాలలో రమేష్ బాబు నటించారు.

నటనతో ప్రేక్షకులను మెప్పించారు.ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసుడు రమేశబాబు కాబోయే సూపర్ స్టార్ అంటూ అభిమానులు భావించారు.

అయితే బాలనటుడిగా రమేష్ బాబు ఎంత సక్సెస్ సాధించాడో అటు హీరోగా అవతారమెత్తిన తర్వాత మాత్రం వరుసగా ఫెయిల్యూర్ అవుతూనే వస్తున్నాడు.సామ్రాట్ అనే సినిమాతో హీరోగా అవతారమెత్తిన రమేష్ బాబు మొదటి సినిమాతోనే విజయం సాధించారు.దీంతో స్టార్ హీరోలు సైతం తమకు ఒక గట్టి పోటీ వచ్చిందని స్పీచ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.ఇంతలా పేరు తెచ్చుకున్న రమేష్ బాబు కృష్ణుడు, బజార్ రౌడీ, కృష్ణ గారి అబ్బాయి, ఆయుధం సినిమాలతో ప్రయత్నం చేసినా చివరికి ఫెయిల్యూర్ తప్పలేదు.

కలియుగ కృష్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కలియుగ అభిమన్యుడు, నా ఇల్లే నా స్వర్గం, మామా కోడలు, అన్నా చెల్లెలు పచ్చతోరణం లాంటి సినిమాల్లో ఎత్తుగడ గుర్తింపు తెచ్చిపెట్టాయి.ఇక వరుసగా సినిమాలు ఫెయిల్యూర్ కావడంతో తనలోతానే నలిగిపోతూ వచ్చారు ఆయన.ఆతర్వాత రమేష్ బాబు నిర్మాతగా కూడా అవతారమెత్తారు.

Hero Ramesh Babu Career Down Reasons Ramesh Babu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube