కాన్పూర్‌లో కుట్ర, కాల్‌సెంటర్‌తో అమలు.. అమెరికాలో వేలాది మంది బాధితులు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కూర్చొని వేల కిలోమీటర్ల దూరంలో వున్న అమెరికన్లను మోసగించాడో కేటుగాడు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 వేల అమెరికా పౌరులు ఇతని వలకు చిక్కి బాధితులుగా మారారు.

 This Is How A Fake Call Center In Kanpur Duped Americans Using Pop Up Ads, Mohin-TeluguStop.com

అయితే పాపం పండిన నాడు ఎంతటి మేధావి అయినా చట్టానికి దొరకాల్సిందే అన్నట్లుగా ఇతని కుట్రను పోలీసులు బట్టబయలు చేశారు.

వివరాల్లోకి వెళితే.

మొహిందర్‌ శర్మ యువకుడు నోయిడాకు చెందిన రిటైర్డ్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి కుమారుడు.పుణె యూనివర్శిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తిచేసిన అతను లాక్‌డౌన్‌ సమయంలో ఢిల్లీలోని ఓ కంపెనీలో పార్ట్‌నగర్‌గా చేరాడు.

ఈ కంపెనీకి అమెరికాలో కూడా బ్రాంచ్‌ ఉన్నది.దీన్ని ఆసరాగా చేసుకుని కొత్త రకం మోసానికి తెరదీశాడు మొహిందర్‌ శర్మ.కాన్పూర్‌లోని కాకాదేవ్‌లోని ఓం చౌరాహా వద్ద ఉన్న ఒక హాస్టల్‌లో బేస్మెంట్‌ను రూ.45 వేల అద్దెకు తీసుకొని క్వాడ్రంట్ రీసెర్చ్ అండ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కాల్ సెంటర్‌ను ప్రారంభించాడు.ఇక్కడ ఒక షిఫ్ట్‌లో 15 నుంచి 20 మంది ఉద్యోగులు పనిచేసేలా ఏర్పాటు చేశాడు.బ్యాంకులు, రైల్వేవంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీయువకులతో పాటు లాక్‌డౌన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారిని సంప్రదించి.వారి అర్హతను బట్టి రూ.10 నుంచి రూ.15 వేల వరకు వేతనంతో ఉద్యోగాలు ఇచ్చాడు.

కుట్రలో భాగంగా అమెరికన్లకు మాల్‌వేర్‌ ద్వారా మెసేజ్‌ పంపి వారి కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసేవాడు.

ఆ వెంటనే ఇతని కాల్‌ సెంటర్‌‌లో పనిచేస్తున్న ఉద్యోగులు బాధితులకు ఫోన్ చేసేవారు.మాల్‌వేర్‌ను తొలగిస్తామని.ఇందుకు గాను 200 నుంచి 300 డాలర్లు వసూలు చేసేవారు.తాము చెప్పిన ఖాతాల్లోకి బాధితులు నగదు ట్రాన్స్‌ఫర్ చేయగానే మాల్‌వేర్‌ను తొలగించేవారు.

అంతేకాదు కాల్ సెంటర్‌కు అదనంగా నోయిడాలో మరో 25 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో టెక్నికల్ టీమ్‌ కూడా సిద్ధం చేసుకున్నాడు మొహిందర్.ఈ విధంగా దాదాపు 12 వేల మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అతని మోసాలపై ఫిర్యాదులు అందడంతో ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రంగంలోకి దిగి మొహిందర్‌ శర్మతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.వీరు మాల్‌వేర్ మోసాల ద్వారా దాదాపు రూ.8-9 కోట్ల మేర వసూలు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Telugu Mohinder Sharma, Noida, Omchauraha, Kanpurduped, Pune-Telugu NRI

ఇక ఇదే రకమైన మాల్‌వేర్ ద్వారా అమెరికన్లను మోసం చేసిన హిమాన్షు అస్రీ అనే వ్యక్తికి ఈ ఏడాది మే నెలలో అమెరికా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.వృద్ధులను ల‌క్ష్యంగా చేసుకున్న హిమాన్షు సైతం మొహిందర్ బాటలోనే కంప్యూటర్ వినియోగించేవారి స్క్రీన్లపై పాప్ అప్ ప్రకటనలు ఇచ్చేవాడు.ఎవరైనా పొర‌పాటున ఆ యాడ్‌ను క్లిక్ చేస్తే చాలు.

మీ కంప్యూటర్లలో వైరస్ చొరబడిందని. సిస్టమ్ రిపేర్ కోసం ఫలానా నంబర్‌కు కాల్ చేయాల‌ని మెసేజ్ వచ్చేది.

దీంతో భయపడిపోయిన వినియోగ‌దారులు వెంట‌నే హిమాన్షు చెప్పిన నెంబర్‌కు కాల్ చేసేవారు.అవన్నీ భారత్‌లో ఏర్పాటు చేసిన కాల్‌సెంట‌ర్స్‌కు వచ్చేవి.

అక్కడి సిబ్బంది ముందుగా అనుకున్న పథకం ప్రకారం.మాల్వేర్ నుంచి ర‌క్ష‌ణ కోసం త‌మ వ‌ద్ద ప్యాకెజీలు ఉన్నాయని నమ్మబలికేవారు.

ఇందుకు గాను ఒక్కో వినియోగ‌దారుడి నుంచి దాదాపు 482 డాల‌ర్ల నుంచి 1000 డాల‌ర్ల వ‌ర‌కు వసూలు చేసేవారు.ఈ విధంగా హిమాన్షు ఐదేళ్లకాలంలో 6,500 మందిని మోసం చేసి వారి వద్ద నుంచి రూ.6.81 కోట్లు వ‌సూలు చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube